పూరీ నిజంగానే మారిపోయాడా..?

Last Updated on by

పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా అంటే ఒక‌ప్పుడు చాలా క్రేజ్ ఉండేది. ఆయ‌న పాత క‌థ చెప్పినా కూడా ఎంట‌ర్ టైనింగ్ గా ఉండేది. పైగా కెరీర్ మొద‌ట్లో వ‌ర‌స‌గా కొత్త క‌థ‌ల‌తో ర‌ప్ఫాడించాడు పూరీ. మాస్ యాక్ష‌న్ సినిమాల‌కు ఈయ‌న త‌న స్టైల్ ను జోడించి.. ప‌క్కా పంచ్ డైలాగుల‌తో బాక్సాఫీస్ కు పిచ్చెక్కించాడు పూరీ. కానీ కొన్నేళ్లుగా ఆయ‌న‌లో ఆ చార్మ్ మిస్ అయింది. వ‌చ్చిన ప్ర‌తీ సినిమా కూడా బోల్తా కొడుతూ పోతుంది. దాంతో పూరీ సినిమా అంటే ప్రేక్ష‌కులు కూడా ప‌ట్టించుకోవ‌డం మానేసారు. కానీ త‌న‌ను ఇంకా ప‌ట్టించుకోవాల్సిందే.. ఇంకా జోష్ త‌గ్గ‌లేద‌ని ఇప్పుడు మెహ‌బూబా సినిమాతో నిరూపించే ప‌నిలో ప‌డ్డాడు పూరీ. అంద‌రు వార‌సుల‌కు మాస్ సినిమాలు చేసిన పూరీ.. త‌న వార‌సుడికి మాత్రం ప‌క్కా ప్రేమ‌క‌థ‌తో తీసుకొస్తున్నాడు. అది కూడా ఇండో పాక్ క‌థ‌తో. ఈ చిత్ర ప్రెస్ మీట్ లో దిల్ రాజు కూడా సినిమా చాలా బాగుంద‌ని స్టాంప్ వేసాడు. తాను బాగోక పోతే మొహం మీదే చెప్పేస్తాన‌ని చెప్పాడు దిల్ రాజు.
ఈ మ‌ధ్య కృష్ణార్జున యుద్ధం అప్పుడు కూడా ఫ‌స్టాఫ్ అదిరింది.. సెకండాఫ్ మాత్రం తేడాగానే ఉంద‌న్నాడు రాజు. అన్న‌ట్లుగానే అదే జ‌రిగింది. కానీ ఇప్పుడు మెహ‌బూబాకు మాత్రం క‌చ్చితంగా సూప‌ర్ పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు ఈ నిర్మాత‌. పైగా పూరీ జ‌గ‌న్నాథ్ ను బాగా మెచ్చుకున్నాడు. ఆయ‌న ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నా.. అంద‌రికీ అది కామ‌న్ అని క‌చ్చితంగా మెహ‌బూబాతో జ‌గ‌న్ స‌త్తా చూపిస్తాడ‌ని చెప్పాడు దిల్ రాజు. ఈ చిత్రాన్ని ఆయ‌నే స్వ‌యంగా విడుద‌ల చేస్తున్నాడు. మే 11న రానుంది మెహ‌బూబా. మ‌రోవైపు ఆకాశ్ కూడా త‌నను తండ్రి ప‌రిచ‌యం చేయ‌డం కాదు.. త‌న తండ్రి పూరీనే కొత్త‌గా మీకు ప‌రిచయం చేస్తున్నాన‌ని ధీమాగా చెబుతున్నాడు. మ‌రి వీరి న‌మ్మ‌కం మెహబూబా ఎంత వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలిక..!

User Comments