మాజీ ప్ర‌ధాని పీవీ బ‌యోపిక్

Last Updated on by

రాజ‌కీయ నాయ‌కుల‌పై బ‌యోపిక్ లు అంత‌కంత‌కు హీటెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై, ఇందిర‌మ్మ‌పై బ‌యోపిక్ లు తెర‌కెక్కుతున్నాయి. మోదీ బ‌యోపిక్ ఎన్నిక‌ల వేళ రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. ఇదివ‌ర‌కూ థాక్రే బ‌యోపిక్, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ బ‌యోపిక్ రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్, వైయస్సార్ బ‌యోపిక్ లు రిలీజై ప్ర‌జ‌ల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా పొలిటిక‌ల్ బ‌యోపిక్ ల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

స‌రిగ్గా ఇలాంటి టైమ్ లోనే తెలుగు వాడైన మాజీ ప్ర‌ధాని పాములప‌ర్తి వెంక‌ట న‌ర‌సింహారావు (పీవీ న‌ర‌సింహారావు) బ‌యోపిక్ తెర‌కెక్కిస్తుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. నేటి సాయంత్రం 6 గంట‌ల ప్రాంతంలో ఈ బ‌యోపిక్ ట్రైల‌ర్ రిలీజ‌వుతోంది. పీవీ చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణం.. పీవీ వ‌ల్ల చుట్టూ మారిన వాతావ‌ర‌ణం తెర‌పై చూడండి అంటూ బ‌యోపిక్ కి స్లోగ‌న్ డిక్లేర్ చేయ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. నాడు ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల్లో కీల‌క భూమిక పోషించిన పీవీ న‌ర‌సింహారావుపై సినిమా అంటే ఎంతో ఎమోష‌న్ ఉంటుంద‌ని ఆశిస్తున్నారు. శ్రీ‌క‌ర్ ఫిలింస్ ప‌తాకంపై శ్రావ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌క‌ర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. లిండ్సే చార్లెస్ సంగీతం అందిస్తుండ‌గా, వంద‌న ప్రీతి రీసెర్చ్ అసోసియేట్ గా ప‌ని చేశారు.

User Comments