పీవీఆర్: 10 స్క్రీన్ల‌లో 2594 సీట్లు

Last Updated on by

న‌గ‌రాల్ని మ‌ల్టీప్లెక్సులు ఆక్ర‌మిస్తున్నాయి. పెరిగే జ‌నాభాతో పాటు వినోదం అవ‌స‌రం పెరుగుతోంది. ఇదే అద‌నుగా మ‌ల్టీప్లెక్సు వ్యాపారం మూడు పువ్వులు ముప్ప‌య్ కాయ‌లుగా వ‌ర్ధిల్లుతోంది. వంద‌లు, వేల కోట్ల ఆదాయం తెచ్చి పెడుతోంది. అందుకే అంత‌కంత‌కు మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. కొత్త కాన్సెప్టుల‌తో దూసుకెళ్లాలే కానీ ఈ రంగంలో ఎదురే లేద‌ని పీవీఆర్, ఏషియ‌న్ సినిమాస్ వంటి భారీ మ‌ల్టీప్లెక్స్ చైన్స్ నిరూపిస్తున్నాయి.

తాజాగా చెన్న‌య్‌లో- అన్నా న‌గ‌ర్‌లో పీవీఆర్ ఐక‌న్ అతి భారీ మ‌ల్టీప్లెక్స్  ప్రారంభ‌మైంది. ఇక్క‌డ మొత్తం 10 స్క్రీన్ల‌లో 2594 మంది కూచునేలా సీట్లు అందుబాటులో ఉంటాయిట‌. ఈ త‌ర‌హా చెన్న‌య్ వ్యాప్తంగా ప్రారంభిస్తామ‌ని పీవీఆర్ సంస్థ ప్ర‌తినిధులు ప్ర‌క‌టించారు. విశాల్ సార‌థ్యంలో నిన్న‌టిరోజున పీవీఆర్‌ని ఘ‌నంగా ప్రారంభించారు. ఇక‌పోతే తెలుగు రాష్ట్రాల్లో టాప్ హీరోలు సొంతంగా మ‌ల్టీప్లెక్స్ చెయిన్స్ ర‌న్ చేసేందుకు, ప‌లు కార్పొరెట్ల‌తో ఒప్పందాలు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

User Comments