రాశీని అలా వ‌దిలేసారేంటి..?

Last Updated on by

మొన్న‌టి వ‌ర‌కు వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది. కానీ ఇప్పుడు స‌డ‌న్ గా ఖాళీ అయిపోయింది. ప్ర‌స్తుతం చేతిలో ఉన్న‌ది ఒకే ఒక్క సినిమా. అది కూడా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. దాంతో రాశీఖ‌న్నా ఇక చేసేదేం లేక దేశాలు ప‌ట్టుకుని తిరిగేస్తుంది. ప్ర‌స్తుతం ఈ భామ సింగ‌పూర్ లో ఉంది. అక్క‌డే కొన్ని రోజులుగా ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. జై ల‌వ‌కుశ త‌ర్వాత తెలుగులో ఈ భామ ద‌శ తిరుగుతుంద‌ని ఊహించారు అంతా. కానీ ఏం జ‌ర‌గ‌లేదు. తొలిప్రేమ హిట్ అయినా కూడా ఇప్పుడు వ‌ర‌స ఆఫ‌ర్లు అయితే రావ‌డం లేదు.

ప్ర‌స్తుతం నితిన్ కు జోడీగా శ్రీ‌నివాస క‌ళ్యాణంలో న‌టిస్తుంది. స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివ‌రి షెడ్యూల్ కు వ‌చ్చింది. ఇదిలా ఉంటే త‌మిళ‌నాట సిద్ధార్థ్ తో సైతాన్ కి బ‌చ్చా సినిమాలో న‌టిస్తుంది రాశీ. ఈ చిత్రంలో రాశీ పార్ట్ షూటింగ్ అయిపోయింది. దాంతో ఇప్పుడు దొరికిన హాలీడేస్ ను ఇలా ఎంజాయ్ చేస్తుంది రాశీఖ‌న్నా. త్వ‌ర‌లోనే ఇండియాకు వ‌చ్చి మ‌ళ్లీ శ్రీ‌నివాస క‌ళ్యాణంతో బిజీ కానుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి.. రాశీఖ‌న్నా జాత‌కం మార్చే ఆ ద‌ర్శ‌కుడు ఎక్క‌డున్నాడో..?

User Comments