హారర్ సినిమాలో రాశిఖన్నా

తన అందాన్ని రెట్టింపు చేసుకుందా అన్నట్టుగా కనిపిస్తోంది రాశిఖన్నా. ఈమధ్య చేసిన `వెంకీమామ`, `ప్రతిరోజూ పండగే` సినిమాల్లో రాశిఖన్నా కనిపించిన విధానం కుర్రాళ్లకి భలే నచ్చేసింది. తొలినాళ్లలో బొద్దుగా కనిపించిన ఈమె, ఆ తర్వాత సన్నబడింది. బరువు తగ్గాక కొన్నాళ్లు అందం కోల్పోయినట్టు కనిపించింది. ఈమధ్య అదే నాజూకు అవతారంలో కనిపిస్తూనే, తన అందానికి మెరుగులు దిద్దుకుంది.

ఈదశలో రాశిఖన్నా ఓ కీలక నిర్ణయం తీసుకుంటూ… హారర్ సినిమాకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సుందర్ .సి దర్శకత్వంలో ఆమె ఆరణ్మయి3 చేయబోతోంది. సుందర్ `ఆరణ్మయి` సినిమాల ఫ్రాంచైజీలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఆ చిత్రాలు విడుదలవుతూ వచ్చాయి. రెండు భాషల్లోనూ మంచి గుర్తింపు ఉన్న రాశిఖన్నాని ఎంపిక చేసుకుని ఆ చిత్రాన్ని చేస్తున్నారు సుందర్. మరి రాశిఖన్నా ఏ రేంజ్లో భయపెడుతుందో చూడాలి. ఆమె ఇదివరకు ఈ తరహా చిత్రాలు చేయలేదు.