సెకండ్ ఆప్ష‌న్ చూసుకున్న రాశీఖ‌న్నా..

 

ఈ రోజుల్లో హీరోయిన్లు చాలా తెలివైన వాళ్లు. ఇండ‌స్ట్రీలో స్టార్ ఇమేజ్ మ‌హాఅయితే ఐదేళ్లే ఉంటుంద‌ని గ్ర‌హించారు. అదృష్టం బాలేక‌పోతే ఆ ఐదేళ్లు కూడా ఉండ‌దు. అందుకే ఇమేజ్ ఉండ‌గానే ఇళ్లు కూడా చ‌క్క‌బెట్టుకుంటున్నారు. కొంద‌రు బిజినెస్ చేస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం త‌మ‌కు వ‌చ్చిన ప్రావీణ్యం చూపిస్తున్నారు. ఇప్పుడు రాశీఖ‌న్నా రెండోది చేస్తుంది. న‌ట‌న‌తో పాటు ఈమెలో మంచి గాయ‌ని కూడా ఉంది. ఇన్నాళ్లూ ఈ విష‌యాన్ని పెద్ద‌గా బ‌య‌ట‌పెట్ట‌లేదు రాశీఖ‌న్నా.

బాత్రూమ్ సింగ‌ర్ గానే ఉన్న ఈమెను ప్రొఫెష‌న‌ల్ సింగ‌ర్ గా మార్చేస్తున్నారు మ‌న సంగీత ద‌ర్శ‌కులు. జోరు సినిమాలో టైటిల్ సాంగ్ పాడింది రాశీఖ‌న్నానే. ఈ మ‌ధ్యే మ‌ళ‌యాలంలోమోహ‌న్ లాల్ తో న‌టించిన విల‌న్ టైటిల్ సాంగ్ పాడింది రాశీఖ‌న్నా. ఇన్నాళ్లూ కేవ‌లం త‌ను న‌టించిన సినిమాల్లో మాత్ర‌మే స‌ర‌దాగా పాడిన రాశీ.. ఇప్పుడు సింగింగ్ ను కూడా సీరియ‌స్ గా తీసుకుది. నారా రోహిత్ బాల‌కృష్ణుడులో రాశీఖ‌న్నాతో పాడించాడు సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ‌. ఇక స్టార్స్ ను పాడించే వ‌ర‌కు వ‌ద‌ల‌ని థ‌మ‌న్.. జ‌వాన్ లో రాశీ టాలెంట్ వాడుకున్నాడు.ఈమె పాడిన పాట ఆమెకంటే అందంగా ఉంటుందంటున్నాడు థ‌మ‌న్. మొత్తానికి న‌ట‌న‌తో పాటు సెకండ్ ఆప్ష‌న్ చూస‌కుంది రాశీఖ‌న్నా..!