వామ్మో! ఆ హీరోయిన్ కోవ‌ర్ట్ అట‌

Last Updated on by

స‌ల్మాన్ ఖాన్ , జాక్విలిన్, అనీల్ క‌పూర్ వంటి టాప్ స్టార్లతో తెర‌కెక్కుతున్న `రేస్ 3` ఈద్ కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కొరియోగ్రాఫ‌ర్ ట‌ర్న్‌డ్ డైరెక్ట‌ర్‌ రెమో.డి.సౌజా ద‌ర్శ‌క‌త్వ ంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఎస్‌.కె.ఫిలింస్ సంస్థ అత్య ంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని క్రేజీగా నిర్మిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్‌లో వేగం పుంజుకుంది. ఇదివ‌ర‌కూ నాలుగైదు పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేసి వేడి పెంచారు.

తాజాగా మ‌రో కొత్త పోస్ట‌ర్‌. ఇదివ‌ర‌కూ స‌ల్మాన్ – జాక్విలిన్ జంట పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసిన యూనిట్ ఇప్పుడు కొత్త సందేహాలు రేకెత్తిస్తూ స‌న్నీడియోల్ – జాక్విలిన్ జంట‌గా ఉన్న పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్ చూడ‌గానే జాక్విలిన్ కోవ‌ర్ట్ పాత్ర‌లో న‌టించిందా? అన్న సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు. అడుగ‌డుగునా మోసం.. సీక్రెట్ స్పై ఆప‌రేష‌న్స్ ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూడ‌బోతున్నాం. అంటే జాక్విలిన్ క‌చ్ఛితంగా స్పై అనే చెప్పాలి. స‌ల్మాన్ `టైగ‌ర్ జిందా హై`తో స‌క్సెస్‌ ట్రాక్‌లోకి వ‌చ్చేశారు. జాక్విలిన్ `జుడ్వా` రీమేక్‌తో స‌త్తా చాటింది. డియోల్ బోయ్ కాస్త గ్యాప్ వ‌చ్చినా ఇలాంటి క్రేజీ మూవీతో బ‌రిలోకొచ్చాడు. ఆ క్ర‌మంలోనే ఈ క్రేజీ కాంబినేష‌న్ లో వ‌స్తున్న‌ `రేస్ 3`పై అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింప‌వుతున్నాయి. ఈద్‌కి రిలీజ‌వుతున్న రేస్ 3 బాలీవుడ్‌లో పండ‌గ వాతావ‌ర‌ణం తెస్తుంద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి

User Comments