భాయ్‌ 3డి ట్రీట్‌కి రెడీ

Last Updated on by

3డి సినిమాల హ‌వా ఏ రేంజులో ఉందో చెప్పేందుకు ఇంత‌కంటే పెద్ద ఉదాహ‌ర‌ణ‌ వేరొక‌టి అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల ఇండియాలో రిలీజై సంచ‌ల‌న వ‌సూళ్లు సాధిస్తున్న హాలీవుడ్ సినిమాల జాబితా ప‌రిశీలిస్తే, వీటి విజ‌యం వెన‌క 3డి ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ప‌ని చేస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ `ప‌ద్మావ‌త్‌` హిందీ సినిమా అంతే పెద్ద విజ‌యం సాధించ‌డానికి 3డి వెర్ష‌న్‌లో రిలీజ్ చేయ‌డ‌మే కార‌ణం. బాక్సాఫీస్ స‌క్స‌స్‌లో 3డి మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ వెప‌న్‌లా మారిందంటే అతిశ‌యోక్తి కాదు. అందుకే ఇక ముందు తెర‌కెక్కించే సినిమాల‌న్నీ 3డి సినిమాలే. శంక‌ర్ 2.ఓ, అమీర్‌ఖాన్ `మ‌హాభార‌తం`, అన్నీ 3డిలోనే తెర‌కెక్కుతున్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. కొరియోగ్రాఫ‌ర్ కం డైరెక్ట‌ర్‌ రెమో.డి.సౌజా దర్శకత్వం వ‌హిస్తున్న‌`రేస్ 3` చిత్రాన్ని 3డిలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని 2డిలో మాత్ర‌మే తెర‌కెక్కిస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. ఆ త‌ర‌వాత రెమో విదేశాల‌కు వెళ్లి 3డి టెక్నాల‌జీ మేకింగ్‌లో శిక్ష‌ణ పొందార‌ని తెలిసింది. అయితే ఆ శిక్ష‌ణ అత‌డు తెర‌కెక్కించ‌బోయే ఏబీసీడీ 3 సినిమా కోసం అని అన్నారు. కానీ ఇప్పుడు ఏకంగా అత‌డు పెద్ద షాక్‌నిస్తూ `రేస్ 3` సినిమాని 3డిలో రిలీజ్ చేయ‌నున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు ప్ర‌ఖ్యాత క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్విట్ట‌ర్‌లో వివ‌రాలు అందించారు. రేస్ 3 .. 2డితో పాటు 3డిలోనూ ఈద్ కానుక‌గా రిలీజ్ కానుంది. ఈరోజు ముంబైలో 3డి ట్రైల‌ర్ లాంచ్ చేయ‌నున్నారు. రేస్‌1, రేస్ 2 చిత్రాల్ని మించి రేస్ 3పై అంచ‌నాలు పెరిగేందుకు 3డి ప్ర‌ధానంగా అక్క‌ర‌కొస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

User Comments