మూతి మీద‌ మీసం రాన‌ప్పుడే ఇండ‌స్ర్టీకొచ్చా!

Last Updated on by

జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగామ్ తో చాలా మంది ఔత్సాహిక న‌టీన‌టుల ప్ర‌తిభ బ‌య‌ట ప‌డింది. సినిమాల్లో న‌టించాల‌ని ఎన్నో ఆశ‌ల‌తో బ‌స్సెక్కిన ఔత్సాహికుల‌కు అక్క‌డ అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో జ‌బ‌ర్ద‌స్త్ ఓ వేదిక‌గా మ‌లుచుకుని పేరుప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు. హైప‌ర్ ఆది, ధ‌న్ రాజ్, ఆర్ పి, చ‌లాకీ చంటి, ర‌చ్చ ర‌వి, రాంప్ర‌సాద్ ల‌తో ప్రారంభ‌మైన షో నేటికి స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. విదేశాల్లో సైతం జ‌బ‌ర్ద‌స్త్ తో ఈ గ్యాంగ్ ఎంత ఫేమ‌స్ అయ్యారో తెలిసిందే. గుర్తింపుతో పాటు, డ‌బ్బులు బాగానే సంపాదిస్తున్నారు. మ‌ణికొండ లాంటి కాస్ట్ లీ ఏరియాల్లో సొంతిళ్ల‌ను క‌లిగి ఉన్నారంటే? వాళ్ల రేంజ్ ఏ స్థాయికి చేరుకుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే కొన్నాళ్లుగా ర‌చ్చ ర‌వి జ‌బ‌ర్ద‌స్త్ కు దూరంగా ఉంటున్నాడు. టీమ్ స‌భ్యుల‌తో వివాదం త‌లెత్తడంతో ర‌వి బ‌య‌ట‌కు వ‌చ్చేసాడ‌నే రూమార్ నాటి నుంచి వైర‌ల్ అవుతోంది. తాజాగా దీనిపై ర‌విని ప్ర‌శ్నించ‌గా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసాడు.

జ‌బ‌ర్ ద‌స్త్ గ్యాంగ్ తో ఎలాంటి వివాదాలు లేవు. సినిమాల్లో సక్సెస్ అవ్వాల‌ని ఆ షోని వ‌దిలేసా. అయినా జ‌బ‌ర్ద‌స్త్ వ‌ల్ల నాకొచ్చిందేం లేదు. అంత‌కు ముందు రేడియో జాకీగా ప‌నిచేసాను. ఇంకెన్నోఉద్యోగాలు చేసాను. అందులో ఇదీ ఒక‌టి. జ‌బ‌ర్దస్త్ కోసం ప‌రిశ్ర‌మ‌కి రాలేదు. సినిమాల కోసం వ‌చ్చాను. మూతి మీసం రాన‌ప్పుడే ఇండ‌స్ర్టీకి వ‌చ్చాను. అన్న‌పూర్ణ స్టూడియోలో కాలు పెట్ట‌డానికే నానా అవ‌స్థ‌లు ప‌డ్డాను. వాచ్ మెన్ ని బ్ర‌తిమ‌లాడుకుని స్టూడియోలో కాలు పెట్ట‌గ‌లిగాను. అంత‌కు ముందు క‌ష్టాలు వ‌ర్ణ‌నా తీతం. క‌ష్టం అంటే తెలిసిన వాడిని. సినిమా కోసం ఎన్ని క‌ష్టాలైన ప‌డ‌టానికి సిద్దంగా ఉన్నాను. జ‌బ‌ర్ద‌స్త్ వ‌దిలేసిన‌ప్పుడు నాకేం బాధ అనిపించ‌లేదు. అయినా ఇప్పుడా షో ఎవ‌రు చూస్తున్నారు. యూ ట్యూబ్ లో ఎన్ని లైక్ లు, షేర్లు వ‌స్తున్నాయో! మీకు తెలియదా? అంటూ బ‌ధులిచ్చాడు.

User Comments