న‌య‌న్ ను చూస్తే దెయ్యాలు పారిపోతాయ్

Last Updated on by

హీరోయిన్ న‌య‌న‌తార‌పై త‌మిళ న‌టుడు రాధార‌వి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. న‌య‌న తార‌ను చూస్తే దెయ్యాలే పారిపోతాయ్, ఆమె దెయ్యాల సినిమాలు చేయ‌డం ఏంటి? కామెడీగా ఉందంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన `కోళ‌య‌థిర్` కాలం అనే సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా రాధార‌వి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే ఈ సినిమా షూటింగ్ మ‌ధ్య‌లోనే నిలిపివేసారు. కానీ కార‌ణం లేకుండా ఇలా ప్ర‌చార స‌భ ఏర్పాటు చేసి న‌య‌న్ టార్గెట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. న‌య‌న్ గురించి ఇంకా రాధా ర‌వి మాట్లాడుతూ, ` నయ‌న‌తార మంచి న‌టి. ఆమెను అంతా లేడీ సూప‌ర్ స్టార్ అంటున్నారు. అయితే ఆమెపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. గ‌తంలో ఆమె చేసిన ప‌నులు కూడా ప్రేక్ష‌కాభిమానులు గుర్తంచుకోవాలి. ఇలాంటి ఎన్నో వివాదాల‌ను దాటుకుని న‌య‌న్ పై కొచ్చింది. అందుకు సంతోషం. సినిమాల్లో దేవ‌త పాత్ర‌లు చేయాలంటే ఒక‌ప్పుడు కేఆర్ విజ‌య ను సంప్ర‌దించే వారు.

కానీ ఇప్పుడు ఎవ‌రు ప‌డితే వారే చేసేస్తున్నారని న‌య‌న‌తార‌ను ఉద్దేశిస్తు అన్నారు. ఆ స‌మ‌యంలో న‌య‌తార ఆ ఆవెంట్ లో లేదు. అయితే ఈ వ్యాఖ్య‌లపై రాధిక‌, చిన్మ‌యి, న‌య‌న‌తార ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ కౌంట‌ర్ వేసారు. పాపులారిటీ కోసం రాధార‌వి ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఆయ‌న‌కు అస‌లు బుర్ర ఉందా? ఆయ‌న మాట‌ల‌కు ప్రేక్ష‌కులు న‌వ్వ‌డం, చ‌ప్పట్లు కొట్ట‌డం చూస్తుంటే? బాధేస్తోంది. అయినా న‌డిగ‌ర్ సంఘం ఇలాంటి వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకొద‌ని తెలుసు అని ఆగ్ర‌హం చెందాడు. కోలీవుడ్ నుంచి మ‌గవారేవ‌రైనా ఈ విష‌యంపై మాట్లాడుతారేమోని చూసాను. క‌నీసం ఎవ‌రికీ చీమ కుట్టిన‌ట్లు కూడా లేద‌ని చిన్మ‌యి అంది. రాధిక కూడా రాధార‌వి మాట‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌హిళలంతా ఒక్క‌టవ్వాల‌ని న‌టి వ‌ర‌ల‌క్ష్మి తెలిపింది.

User Comments