మ‌ళ్లీ సెక్స్ గురించి మాట్లాడిన రాధిక‌..

సెక్స్ అనే ప‌దాన్ని సాధార‌ణంగా ప‌దిమందిలో మాట్లాడటానికి కూడా ఆలోచిస్తుంటారు. కానీ రాధికాఆప్టే మాత్రం అదేదో ఊత‌ప‌దంలా వాడేస్తుంది. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ సెక్స్ అనే ప‌దాన్ని విచ్చ‌ల‌విడిగా వాడేస్తుంది. అస‌లు ఈ భామ పేరు వింటే చాలు ఏదో ఓ కాంట్ర‌వ‌ర్సీ వినిపిస్తూనే ఉంటుంది. అంత‌గా నోటి దురుసు ఉంది ఈ భామ‌కు. ఎప్పుడూ ఏదో ఓ కాంట్ర‌వ‌ర్సీతో వార్త‌ల్లో నిల‌వ‌డం అంటే ఈ భామ‌కు భ‌లే స‌ర‌దా. ఇప్పుడు కూడా ఇదే చేసింది రాధిక‌. ఇదివ‌ర‌కే ద‌క్షిణాది ఇండ‌స్ట్రీ గురించి.. మ‌రీ ముఖ్యంగా తెలుగు ఇండ‌స్ట్రీ గురించి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడింది రాధిక ఆప్టే. తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌కు వ్యాల్యూ ఉండ‌ద‌ని.. ఇక్క‌డ ఎవరికి వారు ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఆడ‌వాళ్ల‌ను ట్రీట్ చేస్తార‌ని కామెంట్ చెప్పింది రాధిక‌. ఇక త‌న‌ను ఓ హీరో ప‌డ‌క‌గ‌దికి పిలిచాడ‌ని కూడా చెప్పింది రాధిక ఆప్టే.

ఇక ఈ మ‌ధ్యే ఓ నిర్మాత‌పై కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. మొద‌ట్లో త‌న‌ను ఓ నిర్మాత సినిమా గురించి మాట్లాడతాన‌ని హోటల్ కి పిలిపించి.. ప‌డ‌క‌గ‌దికి రావాలంటూ అడిగాడ‌ని చెప్పింది రాధిక‌. కానీ తాను మాత్రం దానికి ఒప్పుకోలేద‌ని.. బ‌హుశా అందుకే తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కు అవ‌కాశాలు రావ‌ట్లేదంటూ ఓపెన్ గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది రాధిక ఆప్టే. ఇప్పుడు ప్ర‌తీ ఇంట్లో సెక్స్ వేధింపులు త‌ప్ప‌వ‌ని మ‌రోసారి రెచ్చిపోయింది రాధిక‌. కేవలం సినిమా రంగంలోనే కాదు.. పిల్లలపై వేధింపులు.. గృహహింస అనేవి అన్నిచోట్లా ఉన్నాయి. ప్రతీ రంగంలో అఖరికి ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా ఈ వేధింపులకు గురి కావాల్సి వస్తోందంటోంది రాధిక‌. అంతేకాదు పురుషుల‌కు కూడా ఈ సెక్స్ వేధింపులు త‌ప్ప‌ట్లేద‌ని చెప్ప‌డం విశేషం. మొత్తానికి మ‌న‌సులో అనుకున్న‌ది అనుకున్న‌ట్లు పైకి చెప్పాల‌న్నా కూడా బోలెడు ధైర్యం కావాలి. అది దేవుడు ఈ భామ‌కు ఇచ్చాడు.