కాంచన రీమేక్ నుంచి లారెన్స్ వాకౌట్

Last Updated on by

`కాంచ‌న‌` చిత్రాన్ని బాలీవుడ్ లో ల‌క్ష్మిబాంబ్ టైటిల్ తో రాఘ‌వ లారెన్స్ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అక్ష‌య్ కుమార్, కియారా అద్వాణి జంట‌గా న‌టిస్తున్నారు. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తిచేసారు. అయితే సినిమా నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ద‌ర్శ‌కుడు లారెన్స్ యూనిట్ కి షాకిచ్చారు. గౌర‌వించ‌ని టీమ్ తో క‌లిసి ప‌నిచేయ‌నంటూ సంచ‌ల‌న నిర్ణ‌యంతో బ‌య‌ట‌కు వ‌చ్చేసారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే?

శ‌నివారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ని యూనిట్ రిలీజ్ చేసింది. అయితే లారెన్స్ అనుమ‌తి లేకుండా..క‌నీసం ఆయ‌నకు విష‌యం చెప్ప‌కుండా నేరుగా మార్కెట్ లోకి విడుద‌ల చేసారు. దీంతో లారెన్స్ ఫీల‌య్యాడు. గౌర‌వం ఇవ్వ‌ని ఇంటికి వెళ్లకూడ‌ద‌ని త‌మిళంలో ఓ సామెత ఉంది. ఈ ప్ర‌పంచంలో డ‌బ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం. నాకు ఆత్మాభిమానం ఉంది కాబ‌ట్టి సినిమా నుంచి త‌ప్పుకుంటున్నా. నేను కార‌ణం చెప్పాల‌నుకోవ‌డం లేదు. ఎందుకంటే కారణాలు చాలా ఉన్నాయి. పోస్ట‌ర్ రిలీజ్ చేసిన‌ట్లు మూడ‌వ వ్య‌క్తి ద్వారా నాకు తెలిసింది. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడిగా చ‌లా బాధ‌ప‌డుతున్నా. ఇలాంటి ప‌రిస్థితి ఏ ద‌ర్శ‌కుడికి రాకూడ‌దు. ఇది నా సినిమా కాబ‌ట్టి స్ర్కిప్ట్ ఇచ్చేయ‌మ‌ని అడ‌గ‌ను. క‌థ అక్ష‌య్ కి ఇచ్చేసి..వారికి న‌చ్చిన వారితో సినిమా చేసుకోమ‌ని చెబుతాన‌ని లారెన్స్ వెల్ల‌డించారు. అలాగే చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు.

User Comments