పడక సుఖం కోరుకుంటున్నారంటున్న లక్ష్మీరాయ్ 

Rai Laxmi sensational Comments Casting Couch

టాలీవుడ్ కోలీవుడ్ అనే సంబంధం లేకుండా ఈ మధ్య హీరోయిన్స్ అందరూ కాస్టింగ్ కౌచ్, అంటే అవకాశాల పేరు చెప్పి లైంగిక సుఖాలు కోరుకోవడం గురించి ఓపెన్ గా మాట్లాడేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులోకి టాలెంటెడ్ హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ కూడా చేరడం విశేషం. ఈ మధ్య హీరోయిన్ గా పెద్దగా బ్రేక్ రాకపోయినా.. మెగా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి పాపులర్ అయిపోయిన లక్ష్మీరాయ్ ఉన్నట్టుండి సినీ పరిశ్రమ చీకటి కోణాల గురించి సీరియస్ గా మాట్లాడటం గమనార్హం. ఆ విషయంలోకి వెళితే, ముందుగా సినీ ఇండస్ట్రీలోని కొందరు నిర్మాతలు, ఫిల్మ్ మేకర్స్ హీరోయిన్స్ తో పడుకునేందుకు ఉత్సాహం చూపుతారని ఓపెన్ గానే చెప్పేసిన లక్ష్మీరాయ్.. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తమ్మాయిలు, హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్న హీరోయిన్లను నిర్మాతలు పట్టి పీడుస్తున్నారని చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా కొందరు ఫిలిం మేకర్స్ ఇండస్ట్రీకి సరదాల కోసం, సుఖాలు అనుభవించడం కోసం వస్తారని, వీళ్ళు హీరోయిన్ల వ్యక్తిగత అవసరాలపై కూడా బాగా దృష్టి పెడుతుంటారని, అదంతా వారితో గడిపేందుకే నని తేల్చిచెప్పేసింది. చివరగా ఆ కొందరు ఫిల్మ్ మేకర్స్ తమ సుఖాల కోసం పేరున్న ఆర్టిస్టులను కూడా వదలడం లేదని, అలాగే తమతో పడక పంచుకోవడానికి నిరాకరించిన ఆర్టిస్టులను సినిమా నుంచి తప్పించేస్తున్నారని స్పష్టం చేసింది. అయితే, ఇదంతా బాగానే ఉన్నా.. ఆవేశంగా ఈ విషయంపై బోల్డ్ గా మాట్లాడినా.. తనకు మాత్రం ఇలాంటి పరిస్థితులేమీ ఎదురుకాలేదని లక్ష్మీరాయ్ చెప్పడం గమనార్హం. మరి లక్ష్మీరాయ్ తన చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి చూసి చలించిపోయిందో ఏంటో. ఏదిఏమైనా, మరోసారి సినీ పరిశ్రమలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థమవుతుంది. ప్రధానంగా కాస్టింగ్ కౌచ్ సంస్కృతి ఎంతలా పాతుకుపోయిందో తెలుస్తోంది.