అమ్మాయిలు రాజ్ త‌రుణ్ ను మోసం చేసారు

Last Updated on by

అదేంటి.. అబ్బాయిల చేతుల్లో మోస‌పోయిన అమ్మాయి అని క‌దా ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. అది ఇండ‌స్ట్రీలో అయితే ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది కానీ రాజ్ త‌రుణ్ ఏంటి అమ్మాయి చేతిలో మోస‌పోవ‌డం అంటున్నారు అనుకుంటున్నారా..? అది కూడా ఒక్క‌సారి కాదు రెండుసార్లు వ‌ర‌స‌గా మోస‌పోయాడు ఈ కుర్ర హీరో. క‌థ చెప్పి.. బాగుంటుంద‌ని న‌చ్చ‌జెప్పి పాపం ఈ కుర్రాన్ని మోసం చేసారు ఇద్ద‌రు అమ్మాయిలు.. అదే లేడీ డైరెక్ట‌ర్స్. అస‌లే తెలుగులో మ‌హిళా ద‌ర్శ‌కురాళ్లు లేరు. అలాంటిది ఇద్ద‌రికి వ‌ర‌స‌గా అవ‌కాశం ఇచ్చాడు ఈ కుర్ర హీరో. మొన్న సంక్రాంతికి శ్రీ‌రంజ‌నితో రంగులరాట్నం సినిమా చేసాడు. అది డిజాస్ట‌ర్.

ఇక ఇప్పుడు సంజ‌నారెడ్డిని న‌మ్మి రాజుగాడు చేసాడు. ఇది కూడా టాక్ తేడాగానే తెచ్చుకుంది. క‌థ  బాగానే అల్లుకున్నా కూడా ఎంట‌ర్ టైన్మెంట్ లేక‌.. స్క్రీన్ ప్లే లోపంతో రాజుగాడు కూడా చేతులెత్తేసేలా క‌నిపిస్తున్నాడు. పైగా ఇప్ప‌టికీ మ‌హాన‌టి స్ట్రాంగ్ గానే ఉంది. దాంతో రాజ్ త‌రుణ్ కు మ‌రోసారి సారీ త‌ప్ప‌దు. అయితే ఈ హీరోకు ఇన్ని దెబ్బ‌లు తగులుతున్నా దిల్ రాజు నిర్మాత‌గా ల‌వ‌ర్ సినిమా ఉంది. పైగా రాజుగారి టైమ్ న‌డుస్తుందిప్పుడు. ఒక‌వేళ రాజ్ త‌రుణ్ హిట్ కొడితే ల‌వ‌ర్ ఒక్క‌టే దిక్కు. అది కానీ తేడా కొడితే ఈ కుర్రాన్ని మ‌రిచిపోవ‌చ్చేమో ఇంక‌..!

User Comments