రాజ్ త‌రుణ్ మేనేజ‌ర్ రివ‌ర్స్ కౌంట‌ర్

New twist in Raj tarun Accident case

టాలీవుడ్ యువ హీరో రాజ్ త‌రుణ్ కార్ యాక్సిడెంట్ వివాదం గురించి తెలిసిందే. మ‌ద్యం సేవించి నార్సింగి ఔట‌ర్ రింగ్ రోడ్ ప‌రిస‌రాల్లో గోడ‌ను ఢీకొట్టిన రాజ్ త‌రుణ్ అక్క‌డి నుంచి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని పోలీసులు వీడియో ఆధారాల్ని సేక‌రించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. అయితే ఈ కేసులో కార్తీక్ అనే ఓ యువ‌కుడు ఇచ్చిన వీడియో ఆధారం కీల‌కంగా మారింది. పైగా రాజ్ త‌రుణ్ మేనేజ‌ర్ త‌న‌కు డ‌బ్బు ఆశ‌చూపాడ‌ని అత‌డు ఆరోపించ‌డం సంచ‌లన‌మైంది. అయితే ఈ కేసులో నిజానిజాలేంటో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

ఈ విష‌యంపై తాజాగా రాజ్ త‌రుణ్ మేనేజ‌ర్ రాజా ర‌వీంద్ర వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ కేసులో అన్నీ అవాస్త‌వాలు అని అవ‌న్నీ ఆరోప‌ణ‌లు మాత్ర‌మేన‌ని తెలిపారు. యాక్సిడెంట్ జ‌రిగిన చోట మ‌ర్డ‌ర్ ఏదీ జ‌ర‌గ‌లేదు. అంత హ‌డావుడి చేస్తున్నారు త‌ప్ప ఏదీ జ‌ర‌గ‌లేద‌ని రాజా ర‌వీంద్ర అన్నారు. అత‌డు ప్లాన్ చేసి వీడియోలు రికార్డ్ చేసి ఫోన్ లు చేసి త‌మ‌ను డ‌బ్బు డిమాండ్ చేశాడ‌ని రివ‌ర్సులో ఆరోపించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఐదు ల‌క్ష‌లు డిమాండ్ చేస్తే త‌మ వ‌ద్ద అంత డ‌బ్బు లేద‌న్నామ‌ని .. అప్పుడు 3ల‌క్ష‌లు అడిగాడ‌ని రాజా రవీంద్ర అంటున్నారు. అయితే ఈ కేసులో నిజానిజాలేమిటి? అన్న‌ది పోలీస్ వ‌ర్గాలే తేల్చాల్సి ఉంటుంది. రాజ్ త‌రుణ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నారు. డి.సురేష్ బాబు నిర్మాత‌గా ఓ బాలీవుడ్ రీమేక్ లో న‌టించేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈలోగానే ఈ వివాదం సెన్సేష‌న్ అయ్యింది.