రాజుగాడు థాయిలాండ్ వెళ్తున్నాడు

ఇండ‌స్ట్రీకి సైలెంట్ గా దూసుకొచ్చిన బాణం రాజ్ త‌రుణ్. వ‌చ్చీ రాగానే వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు అందుకున్నాడు. అంద‌రిలాగే ఆ త‌ర్వాత జోరు త‌గ్గించాడు ఈ కుర్ర‌హీరో. ప్ర‌స్తుతం ఒక్క హిట్ అంటూ వేచి చూస్తున్నాడు. ఈయ‌న గ‌త సినిమా అంధ‌గాడు అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. ఇక ఇప్పుడు ఈ హీరో ఆశ‌ల‌న్నీ రాజుగాడు సినిమాపైనే ఉన్నాయి. ప్ర‌స్తుతం సంజ‌నా రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రాజుగాడు సినిమాలో న‌టిస్తున్నాడు రాజ్ త‌రుణ్. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. పాట‌ల కోసం థాయ్ ల్యాండ్ వెళ్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. అమైరాద‌స్తూర్ ఇందులో హీరోయిన్. ఈ పాట‌ల చిత్రీక‌ర‌ణ పూర్తైపోతే సినిమా అయిపోయిన‌ట్లే.

రాజుగాడుపైనే రాజ్ త‌రుణ్ ఆశ‌ల‌న్నీ ఉన్నాయి. ఇదిలా ఉండ‌గానే మ‌రో సినిమాకు క‌మిట‌య్యాడు ఈ హీరో. దిల్ రాజు బ్యాన‌ర్ లో అలా ఎలా ఫేమ్ అనీల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం చేస్తున్నాడు రాజ్ త‌రుణ్. ల‌వ‌ర్ అనే టైటిల్ తో ఈ చిత్రం వ‌స్తుంది. శ‌త‌మానం భ‌వ‌తి సినిమానే రాజ్ త‌రుణ్ తో చేయాల్సింది కానీ అనుకోని కార‌ణాల‌తో ఈ సినిమా శ‌ర్వానంద్ కు వెళ్లిపోయింది. అలా మిస్సైన ఛాన్స్ ఇప్పుడు అనీల్ కృష్ణ సినిమా రూపంలో ద‌క్కించుకున్నాడు రాజ్ త‌రుణ్. మొత్తానికి బ్యాడ్ టైమ్ లో బంప‌ర్ ఆఫ‌ర్ లా దిల్ రాజు సినిమా ప‌ట్టేసాడు ఈ కుర్ర హీరో.

User Comments