రాజా నిజంగా నువ్వు గ్రేట్..

ర‌వితేజ‌కు మున‌ప‌టి మార్కెట్ లేదు.. ఇప్పుడు మాస్ రాజా ఇమేజ్ ప‌డిపోయింది అనుకున్న వాళ్ల‌కు రాజా ది గ్రేట్ బిజినెస్ క‌ళ్లు బైర్లు గ‌మ్మేలా చేస్తుంది. ఎంత‌మంది నానిలు వ‌చ్చినా.. సాయిధ‌రంతేజ్ లు వ‌చ్చినా.. ఇప్ప‌టికీ త‌న ఇమేజ్ త‌న‌దే అని నిరూపించుకుంటున్నాడు ర‌వితేజ‌. లేక పోతే మ‌రేంటి..? రెండేళ్ల త‌ర్వాత వ‌స్తోన్నా కూడా రాజా ది గ్రేట్ బిజినెస్ మాత్రం అదిరిపోయింది. ఈ చిత్రం విడుద‌లకు ముందే 50 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 27 కోట్ల‌కు అమ్మారు.. ఇక ఓవ‌ర్సీస్ ప్ల‌స్ క‌ర్ణాట‌కలో క‌లిపి 32 కోట్ల‌కు చేరింది. శాటిలైట్ రైట్స్ లోనూ స‌త్తా చూపించాడు రాజా. తెలుగుతో పాటు హిందీ క‌లిపి ఏకంగా 18 కోట్ల‌కు అమ్ముడైంది ఈ చిత్రం. మొత్తంగా విడుద‌ల‌కు ముందే దిల్ రాజుకు 50 కోట్లు తీసుకొచ్చాడు రాజా ది గ్రేట్. పైగా ఈ చిత్రాన్ని చాలా ఏరియాల్లో సినిమాకు ప‌ని చేసిన వాళ్లే కొనేసారు. సినిమాపై అంత న‌మ్మ‌కంగా ఉన్నారు వీళ్లంతా. మరికొన్ని గంటల్లో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కానుంది రాజా ది గ్రేట్. మ‌రి విడుద‌ల త‌ర్వాత రాజా సంచ‌ల‌నాలు ఎలా ఉండ‌బోతున్నాయో చూడాలిక‌..!