రాజా యుఎస్ లోనూ గ్రేటే..

రెండేళ్లు గ్యాప్ తీసుకున్నా.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో వ‌చ్చాడు ర‌వితేజ‌. మ‌ళ్లీ కెరీర్ గాడిన ప‌డేలా రాజా ది గ్రేట్ తో కుమ్మేస్తున్నాడు మాస్ రాజా.

ఈ చిత్రం ఐదు రోజుల వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకుంది. ఇప్ప‌టివర‌కు 34 కోట్ల గ్రాస్.. 20 కోట్ల షేర్ వ‌సూలు చేసింది రాజా ది గ్రేట్.

మ‌న ద‌గ్గ‌ర బాగానే ప‌ర్ఫార్మ్ చేస్తోన్న రాజా ది గ్రేట్.. ఓవ‌ర్సీస్ లోనూ మంచి వ‌సూళ్లు సాధిస్తుంది. అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజ సినిమాల్లో బిగ్గెస్ట్ గ్రాస‌ర్ గా నిలిచింది రాజా ది గ్రేట్. ఇప్ప‌టికే అక్క‌డ 3 ల‌క్ష‌ల 41 డాల‌ర్లు వ‌సూలు చేసింది రాజా ది గ్రేట్.

త్వ‌ర‌లోనే స‌క్సెస్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు అండ్ టీం. హీరోతో పాటు చిత్ర‌యూనిట్ త్వ‌ర‌లోనే యుఎస్ వెళ్ల‌నున్నారు.

అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ర‌వితేజ అంధుడిగా న‌టించాడు. మొత్తానికి చాలా రోజుల త‌ర్వాత నిఖార్సైన స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ర‌వితేజ‌. మ‌రి ఇదే ఊపును ట‌చ్ చేసి చూడుతో కూడా కొన‌సాగిస్తాడో లేదో చూడాలి..!

Follow US