Last Updated on by
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి -1, 2 చిత్రాలు తెలుగులో ఎంత పెద్ద హిట్టయ్యాయో జపనీ భాషల్లో అంతే పెద్ద హిట్టయ్యాయి. అక్కడ ప్రజలు మన బాహుబలికి నీరాజనం పలికారు. వాళ్ల నేటివిటీతో మన నేటివిటీని పోల్చి చూసుకున్నారు. ఆ క్రమంలోనే అక్కడ పత్రికల్లో బాహుబలి సిరీస్పై అద్భుతమైన ఆర్టికల్స్ వచ్చాయి. ఈ దెబ్బకు రాజమౌళి పేరు జపాన్లో మార్మోగిపోయింది.
ఇప్పుడు ఆ పేరును తెలివైన పద్ధతుల్లో క్యాష్ చేసుకోబోతున్నారని తెలిసింది. మన రాజమౌళి తెరకెక్కించిన మగధీర, యమదొంగ వంటి ఫాంటసీ బేస్డ్ సినిమాల్ని జపాన్లో రిలీజ్ చేస్తే హిట్టవుతాయని అంచనా వేస్తున్నారట. ఆ క్రమంలోనే ఆయా చిత్రాల నిర్మాతల్ని మన దర్శకధీరుడు సంప్రదించే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. మగధీర చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. అలానే యమదొంగ చిత్రాన్ని ఊర్మిల గంగరాజు నిర్మించారు. ఇప్పటికే ఆ ఇద్దరితో ఆర్కా మీడియా – జక్కన్న బృందం టచ్లో ఉన్నారని చెబుతున్నారు. అయితే జపనీ భాషల్లో అనువదించి, బాగా ట్రిమ్ చేసి ఈ సినిమాల్ని రిలీజ్ చేస్తే అక్కడ జనం ఆదరిస్తారనే పక్కాగా నమ్ముతున్నారట. చూద్దాం.. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ తరవాత రామ్చరణ్, ఎన్టీఆర్లకు అక్కడ ఫాలోయింగ్ ఏర్పడుతుందేమో?
User Comments