రాజ‌మౌళి చిట్ట‌చివ‌రి సినిమా

ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించే చిట్ట చివ‌రి సినిమా ఏది? ఈ ప్ర‌శ్న‌కు ఆయ‌న నుంచే స‌మాధానం వ‌చ్చింది. హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో జ‌రిగిన ఆర్.ఆర్.ఆర్ స‌మావేశంలో రాజ‌మౌళికి ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత మ‌హాభార‌తం సిరీస్ తీస్తాన‌ని అన్నారు క‌దా? అని ప్ర‌శ్నిస్తే… నా సినిమాలు రిలీజైన ప్ర‌తిసారీ ఈ ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. అయితే నేనెప్పుడూ `మ‌హాభార‌తం` మొద‌లు పెట్టేస్తున్నా అని చెప్ప‌లేదు. కానీ మ‌హాభార‌తం నా డ్రీమ్ అని మాత్రం చెప్పాను.. అని అన్నారు.

ఈ సినిమా ఎప్ప‌టికి తీస్తారు? అని ప్ర‌శ్నిస్తే.. అదే నా చిట్ట‌చివ‌రి సినిమా అవుతుంది. మ‌హాభార‌తం అంటే ఒక సిరీస్ త‌ర‌హా. అందులో చాలా సినిమాలు తీయొచ్చ‌ని రాజ‌మౌళి అభిప్రాయ ప‌డ్డారు. మొత్తానికి రాజ‌మౌళి మైండ్ లోంచి మ‌హాభార‌తం పోలేదు. అది ఎప్ప‌టికీ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్. అమీర్ ఖాన్ లాంటి దిగ్గ‌జాలు ఈ సిరీస్ తీయాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు. కానీ రాజమౌళి అలాంటి అసాధార‌ణ ప్రాజెక్టును తీసేందుకు ఆస్కారం క‌నిపిస్తోంది. మ‌హాభార‌తం వెబ్ సిరీస్ .. యానిమేష్ సిరీస్ వంటివి ఇప్ప‌టికే తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

Also Read: Live Updates : All About RRR