ఆర్ ఆర్ ఆర్ టైటిల్ రిజిస్ట‌ర్?

Last Updated on by

రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్నమ‌ల్టీస్టార‌ర్ సినిమా టైటిల్ పై కొన్ని నెల‌లుగా సందిగ్ధ‌త నెల‌కొన్న సంగ‌తి తెలిసింది. ఆర్ ఆర్ ఆర్ కేవ‌లం వ‌ర్కింగ్ టైటిల్ మాత్ర‌మేన‌ని మొన్న‌టి రోజున రాజ‌మౌళి రివీల్ చేయ‌డం…స‌రైన టైటిల్ ప్రేక్ష‌కుల‌నే పెట్టాల్సిందిగా కోరాడు. దీనిలో భాగంగా టాలీవుడ్ ప్రేక్ష‌కాభిమానులు ఇప్ప‌టికే చాలా టైటిల్స్ ను సామాజిక మాధ్య‌మాల ద్వారా తెలియ‌జేసారు. రామ రావ‌ణ రాజ్యం, రామ రాజుల ర‌ణం, రాణ రంగ రాజులు, ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం, రుద్ర రాణ రంగం, రామ రాజుల రాజ్యం, ఇలా ప‌లు టైటిల్ ను ఆర్ ఆర్ ఆర్ కి జ‌స్టిఫై అయ్యేలా పంపించారు.

అయితే క‌థ‌ను బ‌ట్టి ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారం అనే టైటిల్ ప‌క్కాగా యాప్ట్ అవుతుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారుట‌. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల పాత్ర‌ల ప‌రంగాను ఈ టైటిల్ అయితే బాగుంటుంద‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారుట‌. దీనిలో భాగంగా ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం ను ఫిలిం ఛాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. మ‌రి ఇందులో వాస్త‌వం ఎంత‌న్న‌ది యూనిట్ స్పందిస్తే గాని క్లారిటీ రాదు. కాగా అభిమానుల నుంచి ఇంకా టైటిల్స్ వ‌స్తూనే ఉన్నాయి. వాటిలో ది బెస్ట్ అనుకున్న దాన్న‌ది తీసుకునే అవ‌కాశం లేక‌పోలేదు.

User Comments