RRRలో అలియాతో అదిరిపోయే సీన్లా?

Last Updated on by

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కు జ‌క్క‌న్న బ్రేకిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చెర్రీ, తార‌క్ ల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. త‌దుప‌రి షెడ్యూల్ కి రంగం సిద్ద‌మ‌వుతోంది. దానికి సంబంధించి హైద‌రాబాద్ లోనే ప్రత్యేకంగా కొన్ని సెట్లు నిర్మిస్తున్నారు. తాజాగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇందులో చెర్రీకి జోడీగా బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే అలియా కోసం నేరుగా జ‌క్క‌న్న క‌లం ప‌ట్టి కొన్ని స‌న్నివేశాలు రాస్తున్నాడుట‌. సినిమాలో ఆ సీన్స్ అదిరిపోతాయ‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది.

వాస్త‌వానికి ఈ స‌న్నివేశాల‌ను విజ‌యేంద్ర ప్ర‌సాద్ ముందే రాసిపెట్టారుట‌. కానీ వాటిలో ప‌ర్పెక్ష‌న్ మిస్ అవుతుందిట‌. అలియాలాటి భామ‌ను తెర‌పై చూపిస్తున్నామంటే? బాహుబ‌లిలో అవంతిక పాత్ర పోషించిన త‌మ‌న్నా కంటే అందంగాను అంత‌కు మించి స‌న్నివేశాలు పండే విధంగాను ఉండాలిగా! బ‌హుశా అందుకేనేమో జ‌క్క‌న్న క‌లం ప‌డుతున్న‌ట్లున్నాడు. బాహుబ‌లిలో కూడా కొన్ని స‌న్నివేశాల‌ను రాజ‌మౌళి రాసిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడిగా ఎంత సృజ‌నాత్మ‌క‌త గ‌ల‌వారో? అంత‌కు మించిన రైట‌ర్ ఆయ‌న‌లో దాగి ఉన్నాడు.

Also Read : Ramcharan’s Blockbuster All Set To Conquer Kerala

User Comments