రాజమౌళి కొడుకు మోసం చేశాడనే ఆరోపణలు

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయకు సినీ సర్కిల్ లో మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే.

తండ్రి సినిమాలకు పనిచేయడం, ముఖ్యంగా బాహుబలికి వెనకుండి తనవంతు సహాయ సహకారాలు అందించడంతో కార్తికేయకు మంచి పేరే వచ్చింది.

అయితే అలాంటి జక్కన్న కొడుకు కార్తికేయ ఇప్పుడు చీటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటుండటం షాకింగ్ న్యూస్ అనే అనాలి.

అసలు విషయంలోకి వెళితే…….

వారాహి సినిమా వారు నిర్మిస్తూ ప్రస్తుతం రిలీజ్ కు రెడీ చేస్తోన్న నాగచైతన్య ‘యుద్ధం శరణం’ సినిమాకు రాజమౌళి కొడుకు కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా పని చేసిన విషయం తెలిసే ఉంటుంది.

అంటే నిర్మాత ఇచ్చిన మేరకు, డైరెక్టర్ విజన్ కు తగ్గట్లు షూటింగ్ ప్లానింగ్ అంతా కార్తికేయ చూసుకున్నాడన్నమాట.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం వాడిన డ్రోన్స్ (ఫ్లయ్ క్యామ్స్) విషయంలో ఓ డ్రోన్స్ తయారీ సంస్థను కార్తికేయ మోసం చేశాడని తాజాగా ఓ డ్రోన్ ఆపరేటర్ కంప్లైంట్ చేసినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి.

ఈ విషయంలో సదరు వ్యక్తి ఆరోపణల ప్రకారం..

చైతూ సినిమాకు ఒక రకమైన డ్రోన్లు కావాలని కార్తికేయ అడగటమే కాకుండా ఆ డ్రోన్స్ తయారుచేయడానికి కావాల్సినంత సమయం ఇవ్వకుండానే డ్రోన్లు అర్జెంట్ గా కావాలని సెట్ కు తెచ్చేయమని ఆర్డర్ పాస్ చేశారట.

అయితే, కష్టపడి డ్రోన్స్ తెచ్చాక మాత్రం 9 రోజుల పాటు సెట్ లో వాటిని ఉంచుకుని 10వ రోజున నువ్వు సరిగ్గా చెప్పింది చేయలేదు అంటూ కామెంట్ చేశారని సదరు కంప్లైంట్ చేసిన వ్యక్తి ఆరోపిస్తున్నాడు.

అలాగే పేమెంట్ ఇవ్వకుండా ఇప్పుడు డ్రోన్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో ఇప్పుడు తన పేరు, వివరాలను బయట పెడితే, కార్తికేయ ఒక పెద్ద డైరెక్టర్ కొడుకు కాబట్టి తన ఫ్యూచర్ ప్రమాదంలో పడుతుందని సదరు వ్యక్తి వాపోతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఇదే విషయంపై కార్తికేయను మీడియా ప్రశ్నిస్తే..

సదరు వ్యక్తి చెప్పిన పని సరిగ్గా చేయలేదని, అతని డ్రోన్స్ నా దగ్గర ఉన్న మాట నిజమే కాని వాటితో నేను మాత్రం ఏం చేసుకుంటానని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా అతనికి సగం పేమెంట్ ఇచ్చేశామని, అయితే అందులో టెన్ పర్సెంట్ పని కూడా అతను చేయలేదని.

అందుకే అతని కారణంగా ప్రొడక్షన్ హౌస్ చాలా నష్టపోయిందని, అయినా రేపోమాపో అతని డ్రోన్స్ అతనికి తిరిగిచ్చేస్తామని కొంచెం గట్టిగానే చెప్పాడు.

మరి ఇందులో ఎవరి వాదన కరెక్టో వారికే తెలియాలి. ఏదిఏమైనా, ఇప్పుడు ఇలా మన రాజమౌళి కొడుకుపై ఇలాంటి ఆరోపణలు రావడం నిజంగా బాధాకరమే.

Follow US