సైరా దెబ్బ‌కు రాజ‌మౌళిలో టెన్ష‌న్

Sye Raa ,Rajamouli(File Photo)

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `సైరా న‌రసింహారెడ్డి` తెలుగు రాష్ట్రాల్లో చ‌క్క‌ని వ‌సూళ్లు సాధిస్తున్నా హిందీ లో మాత్రం డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ ని అందుకోవ‌డం ఊహించ‌ని ప‌రిణామం. ఓవైపు హిందీ స‌మీక్ష‌కులు అద్భుతమైన సినిమా అంటూ అదిరిపోయే రేటింగులు ఇచ్చారు. అయినా అది ఈ సినిమా క‌లెక్ష‌న్ల‌కు ఏమాత్రం ఊపు తేలేద‌ని తెలుస్తోంది. తెలుగు వెర్ష‌న్ కి ధీటుగా దాదాపు 1000 థియేట‌ర్ల‌లో ఉత్త‌రాది మొత్తం సైరా చిత్రం అత్యంత భారీగా రిలీజైంది. అయితే అక్క‌డ ఆశించినంత‌గా జ‌నం థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డం పెద్ద దెబ్బ కొట్టింది. ఓవైపై హృతిక్- టైగ‌ర్ న‌టించిన వార్ 200 కోట్ల వ‌సూళ్ల‌తో హిందీలో ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆ సినిమా ప్ర‌భావం మెగాస్టార్ సైరాపై ప‌డింది.

ఇక ఈ రిజ‌ల్ట్ కేవ‌లం మెగాస్టార్ చిరంజీవి- కొణిదెల బృందాన్నే కాదు.. మ‌రొక‌రిని విప‌రీతంగా టెన్ష‌న్ కి గురి చేస్తోంద‌ట‌. ఒక స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి సినిమాను అద్భుత‌మైన స్కేల్ లో తీసి రిలీజ్ చేశాక దానికి మంచి రివ్యూలు వ‌చ్చాక కూడా క‌లెక్ష‌న్లు రాక‌పోతే దానిని ఏమ‌నాలి? పైగా ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు దాన‌య్య‌. స్వాతంత్య్రంలో ఆంధ్రా వీరుడు అల్లూరి సీతారామ‌రాజు – తెలంగాణ వీరుడు కొమ‌రం భీమ్ యువ‌కులుగా ఉన్న‌ప్పుడు .. ఇద్ద‌రూ క‌లుసుకున్న త‌ర్వాత ఏం జ‌రిగింది? అన్న ఫిక్ష‌న్ క‌థ‌ను వీఎఫ్ ఎక్స్ బేసిస్ లో భారీత‌నంతో తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఉయ్యాల‌వాడ క‌థ‌ను తీస్తే ఫ్లాప్ రిజ‌ల్ట్ వ‌చ్చింది హిందీలో. దాని ప్ర‌భావం ఆర్.ఆర్.ఆర్ పైనా ఉంటుందేమోన‌న్న సందేహాలు జ‌క్క‌న్న‌కు నిద్ర క‌రువ‌య్యేలా చేస్తోంద‌ట‌. ప్రాణం పెట్టి తీసినా .. అస‌లు సౌత్ కి చెందిన వీరుల క‌థ‌లు మ‌న‌కు ఎందుకులే అని నార్త్ జ‌నం లైట్ తీస్కోవ‌డం క‌ల‌వ‌రపాటుకి గురి చేస్తోందట‌. వీళ్లు మ‌ద‌రాసీలు.. అర‌వ తంబీల సోద‌రులు అని లైట్ తీస్కోవ‌డం ఇబ్బందిక‌రంగా మారింద‌ని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఎన్ని భ‌యాలు ఉన్నా జ‌క్క‌న్న ఒకే విష‌యంలో మాత్రం డేర్ గా ఉండొచ్చు. అత‌డికి బాహుబ‌లి ఫ్రాంఛైజీ ద‌ర్శ‌కుడిగా అద్భుత‌మైన ఫాలోయింగ్ ఉంది. పైగా చ‌ర‌ణ్ – ఎన్టీఆర్ లాంటి ట్యాలెంటెడ్ స్టార్లు ఈ చిత్రంలో న‌టించ‌డం కొంత ప్ల‌స్ కానుంది. మ‌రి ఈ ఫీచ‌ర్స్ ఏవైనా ఆర్.ఆర్.ఆర్ కి హిందీ నాట గొప్ప క‌లెక్ష‌న్లు తెస్తాయ‌నే భావించాల్సి ఉంటుంది. 2020 జూలైలో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.