మ‌రో ద‌ర్శ‌కుడికి త‌లైవా గ్రీన్‌సిగ్న‌ల్

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మ‌రో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా? అంటే అవున‌నే అంటున్నాయి కోలీవుడ్ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం ఏ.ఆర్ ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ర్బార్ చిత్రంలో ర‌జ‌నీ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఇప్ప‌టికే మేజ‌ర్ పార్ట్‌ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. త‌న‌ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని ర‌జ‌నీ స్వ‌యంగా వెల్ల‌డించారు. దీంతో ర‌జ‌నీ త‌దుప‌రి సినిమాపై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.

ద‌ర్శ‌కుడు శివ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌నేది తాజా స‌మాచారం. ఇటీవ‌లే ర‌జ‌నీ ఇంట్లో శివ స్క్రిప్టును వినిపించారుట‌. దాదాపు నాలుగు గంట‌ల పాటు డిస్క‌ష‌న్ అనంత‌రం ర‌జ‌నీ ఒకే చెప్పిన‌ట్లు తెలిసింది. వాస్త‌వానికి శివ గ‌తంలోనే త‌లైవాకు క‌థ వినిపించారు. కానీ అది ఆయ‌న‌కు పూర్తిగా న‌చ్చ‌లేదు. ఆ క‌థ‌లో మార్పులు కోరారు. ఈమేర‌కు మార్పులు అనంత‌రం మ‌రోసారి స్రిప్ట్ వినిపించిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాల‌ను యూనిట్ అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది.