క‌ల్కి ఎందుకీ డైల‌మా..?

Kalki Postponed for A Dubbing Film?

యాంగ్రీ హీరో రాజ‌శేఖ‌ర్ న‌టించిన క‌ల్కి రిలీజ్ వాయిదా ప్ర‌స్తుతం హాట్ టాపిక్. అస‌లింత‌కీ ఈ సినిమా ఎందుకు వాయిదా వేశారు. మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామ‌ని అన్నారు క‌దా? అంటూ ఫిలింస‌ర్కిల్స్ లో ఒక‌టే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక డ‌బ్బింగ్ సినిమా రిలీజ్ కి వ‌స్తోంది. అది ఒక్క‌టే క‌ల్కి చిత్రానికి పోటీ. కానీ ఎందుకు భ‌య‌ప‌డుతున్న‌ట్టు?  అంటే …. అస‌లు లాజిక్ అన్న‌దే క‌నిపించ‌డం లేదు.

క‌ల్కి చిత్రాన్ని గంప‌గుత్త‌గా రైట్స్ చేజిక్కించుకున్న కె.కె.రాధామోహ‌న్ ఈ సినిమాతో పాటు ఎన్ జీకే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అయితే క‌ల్కి కంటే ముందే ఎన్జీకే చిత్రాన్ని రిలీజ్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఒక తెలుగు స్ట్రెయిట్ సినిమాని ఆపేసి ఆయ‌న ఇలా డ‌బ్బింగుకే ప్రాధాన్య‌త‌నివ్వ‌డం ఏమిటో అర్థం కాని ప‌రిస్థితి. ఇక‌పోతే సూర్య ఎన్జీకే చిత్రం మే 31న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అటు త‌మిళం స‌హా తెలుగులోనూ సైమ‌ల్టేనియ‌స్ రిలీజ్ కావ‌డంతో ఆరోజే రిలీజ్ చేయాల్సి వ‌స్తోందా? అన్న‌ది తెలియాల్సి ఉంది.  ఇక సూర్య సినిమా క్రేజుతో పోలిస్తే రాజశేఖ‌ర్ కు అంత క్రేజు లేదా? అస‌లెందుకు భ‌య‌ప‌డుతున్నారు? అన్న‌ది తేలాల్సి ఉంది. ఇక‌పోతే ఒక డ‌బ్బింగ్ సినిమా రిలీజ్ కోసం ఇంత వెంప‌ర్లాడ‌డం ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. రాజ‌శేఖ‌ర్ పోలీసాఫీస‌ర్ గా న‌టించిన క‌ల్కి టీజ‌ర్ ఇటీవ‌లే రిలీజై ఆక‌ట్టుకుంది. ప్ర‌శాంత్ వ‌ర్మ రాజ‌శేఖ‌ర్ ని స్టైలిష్ గా ఆవిష్క‌రిస్తున్నారు. ఇంత‌కీ క‌ల్కి కొత్త రిలీజ్ తేదీపై ఎందుకు క్లారిటీ మిస్స‌వుతుందో జీవిత కానీ.. లేదా రాధామోహ‌న్ కానీ చెబుతారేమో చూడాలి.