నిర్మాత కొడుకుతో హీరో కూతురికి అలా సెట్ అయింది!

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని తెరంగేట్రం గురించి గత కొన్నిరోజులుగా వార్తలు బాగానే వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కోలీవుడ్ సినిమాతోనే మొదట శివాని సినీ రంగ ప్రవేశం ఉంటుందని, హీరోయిన్ గా రాణించేందుకు అమ్మడు బాగానే ప్రిపేర్ అవుతుందని ప్రచారం కూడా జరిగింది. రీసెంట్ గా రిలీజైన శివాని లేటెస్ట్ ఫోటో షూట్ చూసినా ఆ విషయం అర్థమైపోతుంది. అయితే, కోలీవుడ్ ప్రాజెక్ట్ గురించి తెలీదు గాని, ఇప్పుడు టాలీవుడ్ లోనే ఓ నిర్మాత కొడుకుతో ఈ హీరో కూతురు సినిమా సెట్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారని తెలియడం విశేషం. ఆ విషయంలోకి వెళితే, 2016లో పెళ్లిచూపులు సినిమాతో నిర్మాతగా భారీ హిట్ కొట్టి ఓ రేంజ్ లో పైకి లేచిన ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా ఇప్పుడు ఓ సినిమా తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట.

దీనికోసం ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా.. అది పూర్తయ్యేపాటికి కొంచెం టైమ్ పట్టి, మొత్తంగా 2018 జనవరిలో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. అందులోనూ 2018 నాటికి అమెరికాలో పెన్న్ స్టేట్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న శివ కందుకూరి డిగ్రీ కూడా పూర్తి కానుండటంతో.. సినిమాను అప్పుడే పెట్టుకోవాలని పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారట. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసమే హీరోయిన్ గా శివానిని తాజాగా ఫైనల్ చేసి పెట్టుకున్నారని టాక్ బయటకొచ్చింది. మరి ఈలోపు శివాని ఏమైనా సినిమాలు చేస్తుందేమో చూడాలి. అదీకాకుండా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను కూడా పక్కనపెట్టి టాలెంట్ ఏజెన్సీగా పేరున్న క్వాన్ తో శివాని ఒప్పందం కూడా చేసుకుని.. సొంతంగా ప్రయత్నాలు కూడా  మొదలు పెట్టిన నేపథ్యంలో ఇంకొన్ని రోజుల్లోనే ఓ సినిమా చేసేలా కనిపిస్తోంది. మరి అది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు గాని, ఇప్పుడు మాత్రం నిర్మాత కొడుకుతో హీరో కూతురు సినిమా అలా సెట్ అవడం మాత్రం సినీ సర్కిల్ లో ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది.

Follow US