అమెరికాలో కాలేజ్ బుల్లోడు?

Last Updated on by

ఎవ‌రైనా కాలేజీ బుల్లోడు అనుకున్నారా? క‌న్ఫ్యూజ‌న్ అస‌లే వ‌ద్దు! 70 ఏజ్ యంగ్ బోయ్ ర‌జ‌నీకాంత్ ఆయ‌నే. ప్ర‌స్తుతం అమెరికా ట్రిప్‌లో ఉన్నారు. అక్క‌డ వేస‌వికి దూరంగా రిలాక్స‌వుతున్నారు. ప‌నిలో ప‌నిగా వ‌య‌సుమీర‌డంతో కాస్తంత‌ వైద్య ప‌రీక్ష‌ల అవ‌స‌రం ప‌డింది. అందుకే కొన్నివారాల ట్రిప్ ఇలా ప్లాన్ చేశారు. ఇప్ప‌టికే సూప‌ర్‌స్టార్ యూఎస్‌లో అడుగుపెట్టేయ‌డ‌మే కాదు.. ఇలా షాపింగ్ మాల్స్‌లో షికార్లు చేస్తున్నారు. అస‌లు వ‌య‌సు అనేది మ‌నసుకు సంబంధించిన‌ది కాదు.. అని చెప్పేందుకు ఆయ‌న‌లోని ఈ స్పీడ్ ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. అమెరికా టూర్‌లో కాలేజ్ బుల్లోడులా మా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు సారు. ఎలానూ `కాలా` ఈ మేలోనే రిలీజైపోతోంది కాబ‌ట్టి, అటుపై 2.ఓ (రోబో2) రిలీజ్ గురించి కాస్తంత సీరియ‌స్‌గానే దృష్టి సారించాల్సి ఉంటుంది. ప‌నిలో ప‌నిగా రాజ‌కీయాల్లోనూ ఆట మొద‌లుపెట్టాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడిలా ఫుల్‌గా రిలాక్స‌వుతున్నారు ర‌జ‌నీ. అస‌లే చెన్న‌య్‌, విజ‌య‌వాడ‌లో ఘోర‌మైన ఎండ‌ల మంట మండుతోంది. ఆ రెండు న‌గ‌రాలు భూమ‌ధ్య రేఖ‌పై ఉన్నాయి కాబ‌ట్టి, ఈ రేఖ నుంచి దూరంగా ఇలా వెళ్లి అస్వాధిస్తున్నార‌న్న‌మాట‌! ఇటీవ‌లే హిమాల‌యాల‌కు వెళ్లి యోగీశ్వ‌రుడిలా క‌నిపించిన ర‌జ‌నీయేనా ఇలా కాలేజ్ బోయ్‌గా మారింది? అన్న టాక్ ఈ ఫోటోలు చూశాక న‌డుస్తోంది.

User Comments