బ్రేకింగ్.. రజినీకాంత్ నవంబర్ లో వస్తున్నాడు

Last Updated on by

ర‌జినీకాంత్ అంటే త‌మిళ హీరో కాదు.. ఇండియ‌న్ హీరో. ఒక్క‌డే సూప‌ర్ స్టార్.. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే ఇండ‌స్ట్రీతో ప‌నిలేకుండా అంతా వేచి చూస్తుంటారు. ఇప్పుడు 2.0 కోసం కూడా అలాగే వేచి చూస్తున్నారు అభిమానులు. కానీ నిర్మాత‌ మాత్రం 2.0 విడుద‌ల తేదీతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు సౌత్ ఇండియాతో పాటు మొత్తం ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో 2.0 రిలీజ్ గురించే చ‌ర్చ. ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యంపైనే చాలా సినిమాల ఫ్యూచ‌ర్ ఆధార‌ప‌డి ఉంది. ఇప్ప‌టికే చాలా సార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రం ఇప్పుడు న‌వంబ‌ర్ 29న విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ చేసుకుంది. ఈ సారి స్వ‌యంగా శంక‌ర్ అనౌన్స్ చేసాడు.

చివ‌రాఖ‌రకు 2.0 విజువ‌ల్ ఎఫెక్స్ పూర్త‌య్యాయి. విజువ‌ల్ కంపెనీలు ఓ డేట్ ఇచ్చేసాయి. న‌వంబ‌ర్ 29న విడుద‌ల చేస్తున్నాం ఈ చిత్రాన్ని అంటూ విడుద‌ల తేదీని ట్విట్ట‌ర్ లో అనౌన్స్ చేసాడు శంక‌ర్. తెలుగు, తమిళ్ తో సహా మొత్తం 15 భాషలలో 2డి, 3డి ఫార్మెట్ లో 2.0 విడుదల కానుంది. న‌వంబ‌ర్ 29 అంటే అప్పుడు మ‌రే సినిమాలు కూడా రావ‌డం లేదు. అందుకే కాస్త ఆల‌స్యం అయినా సోలోగానే వ‌స్తుంది ఈ చిత్రం. మొత్తానికి 2018 రాదేమో అనుకున్న సినిమాను కాస్తా వ‌స్తుంద‌ని చెప్పి ఫ్యాన్స్ కు ఖుషీ ఖ‌బ‌ర్ చెప్పాడు శంక‌ర్.

User Comments