ర‌జినీకి తెలుగు హీరోల‌పై కోపం

అవునా.. తెలుగు హీరోల‌పై ర‌జినీకాంత్ కు ఎందుకు ప‌గ ఉంటుంది అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే మాత్రం నిజంగా ఉంద‌నే అనిపిస్తుంది. లేక‌పోతే మ‌రేంటి.. అన్ని డేట్స్ ఉండ‌గా కావాల‌నే మ‌హేష్, అల్లుఅర్జున్ వ‌స్తోన్న రోజే త‌న సినిమాను కూడా విడుద‌ల చేయ బోతున్నాడు సూప‌ర్ స్టార్. ర‌జినీకాంత్ అంటే కేవ‌లం త‌మిళ్ కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యే ఇమేజ్ కాదు.. అది ఇండియ‌న్ వైడ్ గా ఉన్న క్రేజ్. అలాంటి హీరో సినిమా విడుద‌లైతే అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ అదిరిపోవాల్సిందే. క‌బాలి విడుద‌ల రోజే తెలుగు ఇండ‌స్ట్రీ షేక్ అయిపోయింది. అలాంటి ర‌జినీ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 27న‌ విడుద‌ల కానుంద‌ని అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసాడు నిర్మాత ధ‌నుష్. అదే కాలా. నిజానికి ఆ రోజు 2.0 వ‌స్తుంద‌ని చెప్పాడు శంక‌ర్. కానీ ఈ చిత్రం ఇంకా పూర్తి కాలేదు. విఎఫ్ఎక్స్ కార‌ణంగా ఎప్పుడు వ‌స్తుందో కూడా తెలియ‌నంత క‌న్ఫ్యూజ‌న్ లోకి వెళ్లిపోయింది 2.0. దాంతో ఆ డేట్ ఖాళీగా ఎందుకు వ‌ద‌ల‌డం అని కాలాను విడుద‌ల చేస్తున్నాడు ర‌జినీకాంత్.

ఈ చిత్రాన్ని రంజిత్ తెర‌కెక్కిస్తున్నాడు. క‌బాలితో మెప్పించ‌లేక‌పోయినా ఆయ‌న టేకింగ్ న‌చ్చి మ‌రో అవ‌కాశం ఇచ్చాడు ర‌జినీకాంత్. ఈ సారి కూడా మ‌ళ్లీ మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్న క‌థ‌నే తీసుకొచ్చాడు రంజిత్. ముంబై బేస్డ్ డాన్ గా ఇందులో న‌టిస్తున్నాడు సూప‌ర్ స్టార్. ఏప్రిల్ 27న ఈ చిత్రం విడుద‌ల‌వుతుంటే.. అదే రోజు రానున్న బ‌న్నీ నా పేరు సూర్య‌.. మ‌హేష్ భ‌ర‌త్ అనే నేనుకు తిప్ప‌లు త‌ప్ప‌వు. ఎంతైనా ర‌జినీ సినిమా క‌దా.. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా కుమ్మేసుకుంటాడు. అస‌లే ర‌జినీ ఖ‌లేజా ఎలా ఉంటుందో రోబో టైమ్ లో మ‌హేశ్ కు బాగా అర్థ‌మైంది. ఇక బ‌న్నీ కూడా చూస్తూ చూస్తూ ర‌జినీకాంత్ కు అయితే పోటీగా వెళ్ల‌డు. మొత్తానికి ర‌జినీ చేసిన ప‌నితో ఇప్పుడు తెలుగు హీరోలు త‌ల ప‌ట్టుకుని కూర్చున్నారు.

User Comments