రెండో పెళ్లికి సిద్ధం అవుతున్న రజినీకాంత్ కూతురు

Last Updated on by

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ బిజినెస్‌మేన్, న‌టుడు విష‌గ‌న్ వ‌నంగ‌మూడిని వివాహ‌మాడుతున్నారు. గ‌త ఏడాది ఈ జంట నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ త‌న త‌ల్లిగారైన ల‌త ర‌జ‌నీకాంత్ తో క‌లిసి తిరుప‌తి వెంక‌న్న సామి ఆశీస్సుల‌ను అందుకున్నారు.
చెన్న‌య్ లో ఫిబ్ర‌వ‌రి 11న ఈ వివాహం కొద్ది మంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో డీసెంట్ ఎఫైర్ గా జ‌ర‌గ‌నుంది.  ఫిబ్ర‌వ‌రి 10న ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్ తో వేడుక మొద‌ల‌వుతుంది. పెళ్లి కొడుకు వివ‌రంలోకి వెళితే.. ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం పార్టీ నాయ‌కుడు ఎస్.ఎస్.పొన్ ముడికి వ‌రుడు వ‌నంగ‌ముడి సోద‌రుడు వ‌రుస‌. ఆయ‌న‌కు ఇది రెండో వివాహం. 2018లో ఆయ‌న ఓ సినిమాలోనూ న‌టించారు. ఇక సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ఇదివ‌ర‌కూ అశ్విన్ రామ్ కుమార్ నుంచి 2016లో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. 8ఏళ్ల అనుబంధంలో ఈ జంట‌కు ఓ కుమారుడు ఉన్నాడు. చిన్నారి వేద్ కృష్ణ ప్రస్తుతం సౌంద‌ర్య తోనే ఉంటున్నాడు.

User Comments