ఆస్తులు రాయించేసుకుంటారా కాలా..?

Last Updated on by

కాలా.. ఈ సినిమా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ర‌జినీకాంత్ సినిమా అంటేనే ఆ రేంజ్ ఉంటుంది మ‌రి. అయితే ఒక‌ప్ప‌ట్లా ఇప్పుడు ర‌జినీ సినిమాల‌కు డిమాండ్ ఉందా అంటే మాత్రం స‌మాధానం నో అనే వ‌స్తుంది. ఎందుకంటే ఈయ‌న గ‌త సినిమాల ఫ‌లితాలే దీనికి నిద‌ర్శ‌నం. ర‌జినీకాంత్ ఉన్నా కూడా సినిమాలో క‌థ లేక‌పోతే చూడ‌ట్లేదు ప్రేక్ష‌కులు. ఇప్పుడు కాలా విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈ చిత్ర బిజినెస్ ర‌జినీ గ‌త సినిమాల కంటే త‌క్కువ‌గా జ‌రుగుతుంది. త‌మిళ‌నాట ర‌జినీ ఉన్నాడు కాబ‌ట్టి కొంటున్నారు కానీ తెలుగులో ఇంకా బిజినెస్ కాలేదు. ఇదిలా ఉంటే ఓవ‌ర్సీస్ లో జూన్ 6 రాత్రి నుంచే భారీగా ప్రీమియ‌ర్స్ ప‌డుతున్నాయి. దీనికి టికెట్ రేట్లు ఏకంగా త‌మిళ్ వ‌ర్ష‌న్ కు 25 డాల‌ర్లు.. తెలుగుకు 20 డాల‌ర్లుగా ఫిక్స్ చేసారు.

తెలుగులో సూప‌ర్ స్టార్స్ న‌టించిన సినిమాల‌కే 16 డాల‌ర్లు పెడ‌తారు అక్క‌డి బ‌య్య‌ర్లు. ఒక్క బాహుబ‌లి 2 మాత్ర‌మే 24 డాల‌ర్ల‌తో విడుద‌లైంది. ఆ త‌ర్వాత అజ్ఞాతవాసికి చేసారు. కానీ ఇప్పుడు కాలాకు ఏకంగా 25.. 20 డాల‌ర్లు అంటే అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు త‌ల‌కు మించిన భార‌మే. ప్రీమియ‌ర్స్ తో పాటు రెగ్యుల‌ర్ షోల‌కు కూడా రేట్ భారీగానే ఉంది. త‌మిళ్ వ‌ర్ష‌న్ కు 20 డాల‌ర్లు.. తెలుగుకు 16 డాల‌ర్లు ఉన్నాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఆస్తులు రాయించేసుకుంటున్నారు అక్క‌డి బ‌య్య‌ర్లు. ర‌జినీకి గ‌త వైభ‌వం ఇప్పుడు లేదు. కాలా అద్భుతంగా ఉంద‌నే టాక్ వ‌స్తే త‌ప్ప బ‌య‌టప‌డే ప‌రిస్థితి లేదు. పైగా క‌బాలికి భారీ న‌ష్టాలు వ‌చ్చాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ర‌జినీ సినిమా ఎంత వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి..!

User Comments