షాకింగ్.. కాలా పోస్ట్ పోన్ అయిందా..?

Last Updated on by

ఏమో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం చూస్తుంటే కాలా అనుకున్న టైమ్ కు రావ‌డం క‌ష్టంగానే అనిపిస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈ సినిమా ఏప్రిల్ 27న విడుద‌ల కానుంద‌ని తెలిపారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ధ‌నుష్ తొలిసారి మావ‌య్య‌తో నిర్మించిన సినిమా ఇది. రంజిత్ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే షూటింగ్ అంతా పూర్తైపోయింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పెండింగ్ లో ఉంది. అయితే ఇది ఇప్పుడు జ‌ర‌గ‌డం లేదు. కొన్నిరోజులుగా త‌మిళ ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న స‌మ్మె కార‌ణంగా ఈ చిత్ర వ‌ర్క్ ఆగిపోయింది. అనుకున్న టైమ్ కు వ‌ర్క్ ఇప్పుడు పూర్తి అవు తుందా లేదా అనేది అనుమానంగా మారింది.

స‌గం స‌గం వ‌ర్కుల‌తో హ‌డావిడిగా ప‌ని పూర్తి చేసి సినిమాను విడుద‌ల చేయొద్దంటూ ఇప్ప‌టికే ర‌జినీ నుంచి కాలా టీంకు వార్నింగులు వెళ్లాయి. పైగా ధ‌నుష్ కూడా సినిమా అంతా ప‌క్కా అనుకున్న త‌ర్వాత కానీ బ‌య‌టికి వ‌ద‌లొద్ద‌ని ఫిక్స్ అయిపోయాడు. దాంతో కాలా అనుకున్న టైమ్ కు రావ‌డం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఏప్రిల్ తొలి వారం వ‌ర‌కు కూడా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ బ్యాలెన్స్ ఉంటుంది. అయితే ఈ స‌మ్మె ఎప్ప‌టికి పూర్త‌వుతుందో క్లారిటీ రావ‌డం లేదు. దాంతో రిస్క్ ఎందుక‌ని ముందుగానే మే లో ఓ తేదీని కాలా టీమ్ చూసుకుంటున్నారు. ఈ వారంలో స‌మ్మె విర‌మిస్తే ఓకే.. లేదంటే కాలా అనుకున్న టైమ్ కు రావ‌డం మాత్రం దాదాపు అసాధ్య‌మే.

User Comments