నేల మీకు అధికారం.. మాకు జీవితం..

Last Updated on by

వ‌చ్చేసింది.. కాలా ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. అభిమానుల ఎదురుచూపుల‌కు తెర‌దించేస్తూ చెప్పిన టైమ్ కంటే కాస్త ఆల‌స్యంగా వ‌చ్చాడు కానీ వ‌చ్చీ రావ‌డంతోనే త‌న ప‌వ‌ర్ చూపించాడు కాలా. త‌మిళ్, తెలుగులో ఈ ట్రైల‌ర్ కు అదిరిపోయే స్పంద‌న వ‌స్తుంది. ర‌జినీకాంత్ మ‌రోసారి పూర్తిగా మాస్ అవ‌తారంలో క‌నిపించాడు. ట్రైల‌ర్ లో అమ్మాయి కోసం మొత్తం తిరిగేసాన‌ని చెప్పాడు. కాలా అంటే న‌లుపు.. న‌లుపు అంటే దేవుడు.. శ్ర‌మ‌జీవుల క‌ష్టం అంటూ చెప్పాడు ర‌జినీకాంత్. ట్రైల‌ర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది.

ముంబైలో అణిచివేయ‌బ‌డిన త‌మిళుల కోసం పోరాడే నాయ‌కుడి క‌థే కాలా. నానా ప‌టేక‌ర్ ఈ చిత్రంలో విల‌న్ గా న‌టిస్తున్నాడు. హ్యూమా ఖురేషి హీరోయిన్. అయితే కాలా ట్రైల‌ర్ లో అన్నీ అదిరిపోయినా కూడా క‌బాలి చాయ‌లు క‌నిపిస్తున్నాయి. మ‌ళ్లీ అదే మ్యూజిక్.. అదే స్టైల్.. అదే సెట‌ప్.. కాక‌పోతే అక్క‌డ మ‌లేషియా కాస్తా ఇక్క‌డ ముంబై అయిపోయింది అంతే. మ‌రి క‌బాలి మాదిరే కాలాను కూడా తీసాడా.. లేదంటే కాలాను మ‌రో రేంజ్ లో తీసుంటాడా అనేది మాత్రం ఆస‌క్తి క‌రంగా మారింది. చూడాలిక‌.. క‌బాలితో కొంద‌ర్నే మెప్పించిన రంజిత్.. ఈ సారి కాలాతో ఏం చేస్తాడో..? మ‌రోవైపు ర‌జినీ కూడా పూర్తి రౌడీయిజాన్ని ఇప్పుడు చూపిస్తానంటున్నాడు. జూన్ 7న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

User Comments