రజినీకాంత్ ఆలోచనలు అంతుచిక్కడం లేదు

Last Updated on by

నిజంగా ఇప్పుడు అభిమానుల‌కు కూడా ఇదే అనుమానం వ‌స్తుంది. అస‌లు ర‌జినీకాంత్ ఏం చేస్తున్నాడు..? ఏం చేయాల‌నుకుంటున్నాడు..? ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అనుమానాల‌తో చ‌చ్చిపోతున్నారు అభిమానులు. మ‌రోవైపు ఆనందంతో గాల్లో తేలిపోతున్నారు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఎందుకంటే ఒక‌ప్పుడు మూడేళ్ల‌కో సినిమా అతిథిలా చేసే ర‌జినీ.. ఇప్పుడు ఏకంగా ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్నాడు. అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా.. వ‌ర‌స సినిమాలు ఒప్పుకుంటున్నాడు సూప‌ర్ స్టార్. ఇదే ఇప్పుడు అంద‌ర్లోనూ ఆశ్చ‌ర్యం. మొన్న‌టి వ‌ర‌కు 2.0తో ర‌జినీ కెరీర్ కు ఎండ్ కార్డ్ ప‌డిపోవ‌డం ఖాయం అనుకున్నారంతా. కానీ ఆ త‌ర్వాత సీన్ లోకి రంజిత్ వ‌చ్చాడు. కాలా వ‌చ్చింది. ఇది కూడా షూట్ పూర్త‌యింది. ఏప్రిల్ 27న సినిమా విడుద‌ల కానుంది.Rajinikanth Next Movie Confirmed With Young Director

కాలా పూర్త‌యిందో లేదో అప్పుడే మ‌రో సినిమా ఓకే చేసాడు ర‌జినీకాంత్. కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీకాంత్ సినిమా చేయ‌బోతున్నాడు. పిజ్జాతో ఈయ‌న ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కుర్ర ద‌ర్శ‌కుల‌ను న‌మ్మి వ‌ర‌స‌గా అవ‌కాశాలు ఇస్తున్నాడు ర‌జినీకాంత్. ఈ సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుండ‌టం విశేషం. మొత్తానికి ఇక‌పై ఆర్నెళ్ల‌కోసారి థియేట‌ర్స్ లో ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతున్నాడు ర‌జినీకాంత్. మ‌రోవైపు వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు ఉన్నాయి. క‌మ‌ల్ ఇప్ప‌టికే రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లుపెట్టాడు.. మ‌రోవైపు ర‌జినీ మాత్రం సినిమాల్లో జోరు పెంచేసాడు. ఈ లెక్కే ఇప్పుడు ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

User Comments