రజినీతో ముచ్చటగా మూడో సారి.. నిజమా?

Last Updated on by

కొంద‌రు ద‌ర్శ‌కుల‌ను ట్రాక్ రికార్డ్ చూసి లెక్కేయ‌కూడ‌దు. వాళ్ల టాలెంట్ చూడాల్సిందే. కుర్ర ద‌ర్శ‌కుడు రంజిత్ కూడా ఇదే కోవలోకి వ‌స్తాడు. రెండేళ్ల కింద వ‌చ్చిన క‌బాలి యావ‌రేజ్ గా నిలిచింది. త‌మిళ‌నాట స‌క్సెస్ అయినా.. మిగిలిన ఇండ‌స్ట్రీల్లో ఫ్లాప్ అయింది. అయినా గానీ రంజిత్ పై న‌మ్మ‌కంతో మ‌రో సినిమా ఇచ్చాడు ర‌జినీకాంత్. అదే కాలా. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విడుద‌లైన కాలా ఫ‌స్ట్ లుక్ అదిరిపోయిందంతే. 68 ఏళ్ల వ‌య‌సులో ఉన్న ర‌జినీకాంత్ ను రంజిత్ చూపించిన విధానానికి సాహో అన‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు అభిమానులు. ర‌జినీకాంత్ ను చూసిన త‌ర్వాత కుర్ర హీరోలైతే.. అస‌లు ఇంత గ్లామ‌ర‌స్ గా ఎలా క‌నిపిస్తాడ‌బ్బా అంటూ జుట్టు పీక్కుంటున్నారు. లేక‌పోతే ఏదైనా కెమెరాతో మ్యాజిక్ చేస్తున్నారా.. గ్రాఫిక్స్ వాడుతున్నారా అనిపిస్తుంది.

రంజిత్ తెర‌కెక్కిస్తోన్న  ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లోనూ మ‌రోసారి మాఫియా డాన్ గానే న‌టిస్తున్నాడు ర‌జినీకాంత్. ఈ సారి ముంబైపై ప‌డ్డాడు ర‌జినీ. ఇందులో హ్యూమాఖురేషీ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇదంతా బాగానే ఉంది. కాలా త‌ర్వాత ర‌జినీ సినిమాల‌కు దూరం అవుతాడేమో అనుకున్నారంతా. పైగా సినిమాలు వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి కూడా వ‌చ్చాడు క‌దా అందుకే ఇక ర‌జినీ కెరీర్ ముగిసిపోయింద‌నుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త‌గా మ‌రో సినిమాకు ఈయ‌న సైన్ చేసిన‌ట్లు తెలుస్తుంది. అది కూడా మ‌ళ్లీ రంజిత్ తోనే అనే వార్త‌లు ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తుంది త‌మిళ‌నాట‌. ర‌జినీతో ఒక్క సినిమా చేయ‌డానికే నానా తంటాలు ప‌డుతుంటే.. రంజిత్ వ‌ర‌స‌గా మూడు సినిమాలు ఎలా ప‌ట్టాడో అర్థం కావ‌ట్లేదు అంటున్నారు కొంద‌రు ద‌ర్శ‌కులు. మ‌రి ఈ కుర్ర ద‌ర్శ‌కుడు ర‌జినీకాంత్ ను ఏం చేయాల‌నుకుంటున్నాడో..?

User Comments