హిమాల‌యాల్లో గుర్రంపై సూపర్ స్టార్

Last Updated on by

అదేంటి.. హిమాల‌యాల్లో గుర్రంపై ర‌జినీ ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా..? ప‌్ర‌తీ ఏడాది అక్క‌డికి వెళ్లి కొన్ని రోజులు ధ్యానం చేసుకుని రావ‌డం ర‌జినీకాంత్ కు అల‌వాటు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు సూప‌ర్ స్టార్. సినిమాలు.. బందాలు.. రాజ‌కీయాలు అన్నీ వ‌దిలేసి పూర్తిగా కొన్నాళ్లు అక్క‌డే ధ్యానంలో మునిగిపోతాడు ర‌జినీకాంత్. ఇప్ప‌టికే హిమాల‌యాల్లో కొంద‌రు సాధువుల కోసం ఆశ్ర‌మాలు కూడా క‌ట్టించాడు ర‌జినీకాంత్. ఇక ఇప్పుడు తాను కూడా అక్క‌డే వాళ్ల‌తో పాటే ఉండ‌టం విశేషం. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ర‌జినీకాంత్ కు సాద‌ర స్వాగతం ప‌లికారు అక్క‌డి అభిమానులు అంతేకాదు ఆయ‌న్ని గుర్రంపై తీసుకెళ్లారు. త‌మ సంప్ర‌దాయం ప్ర‌కారం పూజలు కూడా నిర్వ‌హించారు. ర‌జినీ మ‌రికొన్ని రోజుల పాటు అక్క‌డే ఉండ‌బోతున్నారు. వ‌చ్చిన త‌ర్వాతే రాజ‌కీయాల‌పై పూర్తి దృష్టి పెట్ట‌నున్నారు సూప‌ర్ స్టార్.Rajinikanth Reaches Himalayas for Spiritual Pilgrimageహిమాల‌యాల్లో ఉన్నన్ని రోజులు అన్ని సౌక‌ర్యాల‌కు దూరంగా ఉంటారు సూప‌ర్ స్టార్. తాను ఓ పెద్ద హీరో అనే విష‌యాన్ని కూడా మ‌రిచిపోయి సాధార‌ణ జ‌నంతో క‌లిసిపోయి బ‌తికేస్తుంటారు ర‌జినీ. ఇదే ఈయ‌న్ని మిగిలిన హీరోల నుంచి వేరు చేసి చూపిస్తుంది. ప్ర‌స్తుతం ఈయ‌న సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు. కాలాఏప్రిల్ 27న విడుద‌ల కానుంటే.. 2.0 దివాళికి వ‌చ్చే ఛాన్స్ ఉంది. ఇక కార్తిక్ సుబ్బ‌రాజ్ సినిమా కూడా ఇదే ఏడాది మొద‌లై.. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల ముందు విడుద‌ల కానుంది. మొత్తానికి ఇటు సినిమాలు.. అటు రాజ‌కీయాలు.. మ‌ధ్య‌లో హిమాల‌యాలు అన్నింటినీ భ‌లే బ్యాలెన్స్ చేస్తున్నాడు మ‌న సూప‌ర్ స్టార్.Rajinikanth Reaches Himalayas for Spiritual Pilgrimage

User Comments