న‌ష్ట‌పోతే ర‌జ‌నీ వెన‌క్కిచ్చారు!

Last Updated on by

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `కాలా` సినిమా గురించి ఇటీవ‌లి కాలంలో చాలా నెగెటివ్ ప‌బ్లిసిటీనే సాగింది. వ‌రుస ప‌రాజ‌యాల వ‌ల్ల ర‌జ‌నీకాంత్‌కి తెలుగులో మార్కెట్ ప‌డిపోయింద‌ని, `క‌బాలి` ప‌రాజ‌యంతో ర‌జ‌నీ `కాలా` సినిమాని కొనే నాధుడే లేడ‌ని మాట్లాడుకున్నారు. `కొచ్ఛాడ‌యాన్` న‌ష్టాలు ఇప్ప‌టికీ ఫుల్ ఫిల్ కాలేద‌ని చెప్పుకున్నారు.
అయితే అదంతా ఎలా ఉన్నా ఇప్పుడు నిర్మాత ధ‌నుష్ ఈ సినిమాని తిరుప‌తి ప్ర‌సాద్ అలియాస్ ఎన్.వి.ప్ర‌సాద్, దిల్‌రాజు చేతిలో పెట్టారు. ఈ ఇద్ద‌రూ తెలుగు రాష్ట్రాల్లో కాలాని రిలీజ్ చేస్తున్నారు.

అంతేకాదు .. ఈ రోజు కాలా ప్రెస్‌మీట్‌లో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌పై త‌న‌కు ఉన్న ప్రేమాభిమానాల్ని చాటుకున్నారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మ‌న‌సు ఎంత గొప్ప‌దో చెప్పేందుకు ఓ ఎగ్జాంపుల్ చెబుతాను అంటూ ఎన్‌వి ప్ర‌సాద్ గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు. ర‌జ‌నీ న‌టించిన `బాబా` చిత్రాన్ని నేను పంపిణీ చేశాను. ఏరియా హ‌క్కులకు కోటిన్న‌ర పెట్టాను. ఆ సినిమా ఎలా ఆడుతోందో క‌నుక్కునేందుకు ర‌జ‌నీ ఫోన్ చేశారు. యావ‌రేజ్‌గా ఉంద‌ని చెప్పాను. ప‌ది రోజుల త‌ర‌వాత ఆ సినిమా మేనేజ‌ర్ ఫోన్ చేసి ర‌మ్మ‌న్నారు. ఎందుకో ఫోన్ చేశార‌నుకుని వెళ్లాను. నీకు వ‌చ్చిన న‌ష్టం గురించి తెలుసు. ఇదిగో నీ డ‌బ్బు వెన‌క్కి ఇస్తున్నాను. ఈ 50ల‌క్ష‌లు కూడా తీసుకో… ఇదే ప్రాఫిట్‌. పోయేప్పుడు డ‌బ్బు ప‌ట్టుకుపోతామా? నా కోసం తీసుకున్న సినిమా ఇద‌ని అన్నారు ర‌జ‌నీకాంత్‌. ఆరోజు తెలిసింది.. అస‌లు మ‌నిషిగా ఆయ‌న గొప్ప‌త‌నం… అంటూ గతానుభ‌వాన్ని.. ర‌జ‌నీ గొప్ప‌త‌నాన్ని తెలిపారు. ఇక తిరుప‌తి ప్ర‌సాద్ నాకు బాగా తెలుసు. ఆయ‌న ఎంతో మంచివారు అని అన్నారు. ఇక ఇదే వేదిక‌పై దిల్‌రాజు మాట్లాడుతూ .. నా కెరీర్ ప్రారంభంలోనే ర‌జ‌నీకాంత్ న‌టించిన `న‌ర‌సింహా` సినిమా నైజాం కొనుక్కుని రిలీజ్ చేశాను.. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ `కాలా` చిత్రం నైజాం రిలీజ్ చేస్తున్నా.. అని తెలిపారు.

User Comments