రజినీకాంత్ కోరిక బలమైనది

Last Updated on by

ప‌్ర‌తీ మ‌నిషికి జీవితంలో ఓ కోరిక ఉంటుంది.. అది తీరితే అంతా తీరిపోయిన‌ట్లే అనుకుంటారు. అలాంటి ఓ కోరిక ర‌జినీకాంత్ కు కూడా ఉంది. అదే ద‌క్షిణాదిన అన్ని న‌దులు అనుసంధానం చేయ‌డం. అలా చేస్తే నీటి క‌ష్టాలు ఉండ‌వు. అలా జ‌రిగిన‌పుడు ప్ర‌జలంతా క‌ష్టాలు లేకుండా ఉంటారు. అదే జ‌రిగితే తాను ప్ర‌శాంతంగా క‌న్ను మూస్తాన‌ని చెప్పాడు ఈ సూప‌ర్ స్టార్. తాజాగా ఈయ‌న కాలా ఆడియో వేడుక‌లో చాలా విష‌యాలు మాట్లాడాడు. త‌న‌కు న‌ట‌న త‌ప్ప మ‌రేదీ రాద‌న్నాడు ఈ హీరో. పైగా కొన్నేళ్లుగా ర‌జినీకాంత్ ప‌ని అయిపోయింద‌ని చాలా మంది అంటున్నారని.. కానీ ప్ర‌తీసారి అభిమానులు త‌న‌కు అండ‌గా నిల‌బ‌డుతూనే ఉన్నార‌ని గుర్తు చేసుకున్నాడు సూప‌ర్ స్టార్.

ఇక కాలా విష‌యానికి వ‌స్తే ఖచ్చితంగా ఇది మంచి సినిమా అవుతుంద‌ని.. కబాలి చేసిన‌పుడే రంజిత్ లో మంచి ద‌ర్శ‌కున్ని గ‌మ‌నించాన‌ని అందుకే వెంట‌నే మ‌రో ఆఫ‌ర్ ఇచ్చాన‌ని చెప్పాడు ర‌జినీకాంత్. ఈయ‌న లాంటి వ్య‌క్తిని తాను చూడ‌లేని చెప్పాడు ర‌జినీ కాంత్. కాలాలో రాజ‌కీయాలు ఉంటాయి కానీ సినిమా అంతా రాజ‌కీయం కాద‌ని చెప్పాడు సూప‌ర్ స్టార్. ఇక తాను రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమాల‌కు మాత్రం పూర్తిగా దూరం అని చెప్పడం విశేషం. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ర‌జినీకాంత్ పొలిటిక‌ల్ మూవీ చేయ‌డానికి మాత్రం వెన‌కాడుతుండ‌టం ఏంటో ఆయ‌న‌కే తెలియాలి. మొత్తానికి కాలా ఆడియో వేడుక‌లో చాలా విష‌యాల‌నే అభిమానుల‌తో పంచుకున్నాడు ర‌జినీకాంత్.

User Comments