ర‌జినీ 23 ఏళ్ళ త‌ర్వాత అలా వస్తున్నాడు

ర‌జినీకాంత్.. ఈ పేరుకు నార్త్ సౌత్ అనే తేడా లేదు.. ఆల్ సెంట‌ర్స్ హౌజ్ ఫుల్లే. ఈయ‌న నుంచి ఏడాదికి ఒక్క సినిమా వ‌స్తేనే పండ‌గ చేసుకుంటారు అభిమానులు. అలాంటిది ఒకే ఏడాది రెండు సినిమాలు వ‌స్తే ఇక అభిమానుల ఆనందం మామూలుగా ఉండ‌దు. అస‌లిలాంటి చిత్రం జ‌రుగుతుందా అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అది జ‌రిగేలా క‌నిపిస్తుంది. 2.0 మ‌ళ్లీ వాయిదా ప‌డ‌టం.. దాని స్థానంలోకి కాలా కూడా రావ‌డంతో 2018 ర‌జినీ అభిమానుల‌కు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేనిదిగా మిగిలిపోనుంది. నిజానికి కాలాను ఏప్రిల్ 14 త‌మిళ సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని ర‌జినీ అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 27న రాబోతున్న‌ట్లు అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించాడు నిర్మాత ధ‌నుష్.ఇక ఇప్పుడు 2.0 సినిమా దివాళికి పోస్ట్ పోన్ అయింది.

2.0, కాలా సినిమాల‌పై ఆకాశ‌మంత అంచ‌నాలున్నాయి. పైగా ఒక‌టి రోబో ద‌ర్శ‌కుడితో.. మ‌రోటి క‌బాలి ద‌ర్శ‌కుడితో ర‌జినీకాంత్ చేస్తోన్న సినిమాలివి. ర‌జినీ నుంచి ఇలా ఒకే ఏడాది రెండు సినిమాలొచ్చి 23 ఏళ్లైంది. చివ‌ర‌గా 1995లో ముత్తు, బాషా సినిమాల‌తో వ‌చ్చాడు సూప‌ర్ స్టార్. అదే ఏడాది హిందీలో ఆటంక్ హీ ఆటంక్.. తెలుగులో పెద‌రాయుడు సినిమాల్లోనూ న‌టించాడు ర‌జినీ. మ‌ళ్లీ ఇన్నేళ్ళ త‌ర్వాత ఒకే ఏడాది రెండు చిత్రాల‌తో వ‌స్తున్నాడు ర‌జినీకాంత్. అది కూడా అనుకోకుండా ప‌డిన వాయిదాల‌ వ‌ల్ల‌. కార‌ణం ఏదైనా కావ‌చ్చు.. ఒకే ఏడాది రజినీ రెండు సినిమాల‌తో రావ‌డం అనేది మాత్రం అభిమానుల‌కు ఆ క‌లే. ఇప్పుడు దాన్ని తీరుస్తున్నాడు సూప‌ర్ స్టార్. మ‌రి ఇవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సృష్టించే సంచ‌ల‌నాలు ఎలా ఉంటాయో చూడాలి..!

User Comments