ర‌జినీని ముంచిన రంజిత్

Last Updated on by

ఇప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీలోనే కాదు.. అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ కాలా సినిమా చూసిన త‌ర్వాత అనుకుంటున్న మాట ఇదే. ర‌జినీకాంత్ ఒక్క‌సారి ఛాన్స్ ఇస్తేనే అదృష్టంగా భావించే ద‌ర్శ‌కులున్నారు మన ద‌గ్గ‌ర‌. కానీ రంజిత్ ను రెండుసార్లు న‌మ్మాడు ఈ హీరో. కానీ రెండుసార్లు ముంచేసాడు. క‌బాలితో ఏదో అనుకుంటే.. కాలాతో పూర్తిగా ర‌జినీకాంత్ ఇమేజ్ ను కూడా దిగ‌జార్చేసాడు రంజిత్. ఇది ర‌జినీ త‌ప్పు అనేకంటే పూర్తిగా ద‌ర్శ‌కుడి త‌ప్పుగానే భావించాలి. ఓ క‌థ చెప్పినపుడు దాన్ని తెర‌కెక్కించే బాధ్య‌త ద‌ర్శ‌కుడిపైనే ఉంటుంది. ఆ విష‌యంలో రంజిత్ ను పూర్తిగా న‌మ్మాడు రజినీకాంత్. కాలాలో కూడా క‌థ బాగానే రాసుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రోసారి వెన‌క‌బ‌డిన జాతి.. కులం అంటూ ర‌జినీని రెచ్చ‌గొట్టాడు.

దాంతో ఆయ‌న కూడా ఈ కుర్ర ద‌ర్శ‌కుడి మాయ‌లో ప‌డిపోయాడు. అయితే తీసిన విధానం మాత్రం అంద‌రితోనూ విమ‌ర్శ‌లు పడేలా చేస్తుంది. సాధార‌ణంగా ర‌జినీకాంత్ సినిమా వ‌స్తే ఎలా ఉన్నా కూడా తొలిరోజే రికార్డుల‌న్నీ సైడ్ ఇచ్చేస్తుంటాయి. కానీ కాలాతో ఒక్క రికార్డ్ కూడా చేరుకోలేదు ర‌జినీ. పైగా కేవలం 21 కోట్ల ఓపెనింగ్ మాత్ర‌మే వ‌చ్చింది. ఈ ఫెయిల్యూర్ తో ర‌జినీకాంత్ కూడా దిగ‌జారిపోయాడు. ఇక‌పై ఈయ‌న సినిమా కూడా సాధార‌ణ స్టార్ హీరోల సినిమాలే. ర‌జినీ రేంజ్ అంటూ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే ర‌జినీకాంత్ కు వ‌ర‌స ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. రోబో త‌ర్వాత ఈయ‌న‌కు హిట్ లేదు. లింగా.. కొచ్చాడ‌యాన్.. క‌బాలి.. ఇప్పుడు కాలా అన్నీ ఫ్లాపులే. ఇలాంటి టైమ్ లో కార్తిక్ సుబ్బ‌రాజ్ సినిమా కానీ తేడా కొడితే అస‌లుకే మోసం రాక‌మాన‌దు.

User Comments