రాజ్‌త‌రుణ్ ఇదేంటిలా?

Last Updated on by

టాలీవుడ్‌లో క‌మెడియ‌న్లు హీరోలుగా మారుతున్నారు. ఇదో కొత్త ప‌రిణామం. ష‌క‌ల‌క శంక‌ర్ అస‌లు త‌న ఇమేజ్‌కి ఏమాత్రం సంబంధం లేని విధంగా శంభో శంక‌ర‌గా ఎమోష‌న్ పండించాడు. అదో షాక్ అనుకుంటే.. ఇప్పుడు ఇందుకు పూర్తి రివ‌ర్సులో హీరోగారే క‌మెడియ‌న్‌గా మారుతుండ‌డం చ‌ర్చ‌కొచ్చింది. అస‌లింత‌కీ అంత‌టి అత్య‌వ‌స‌ర‌ స‌న్నివేశం ఏం వ‌చ్చింది? అంటే.. ఇదిగో ఇదే స‌మాధానం.

సినీపరిశ్ర‌మ‌లో ఏదైనా జ‌రిగేందుకు ఆస్కారం ఉంది. బ‌ళ్లు ఓడ‌ల‌వుతాయి. ఓడ‌లు బ‌ళ్ల‌వుతాయిక్క‌డ‌. ఒక్కోసారి ఊహించ‌ని ట్విస్టులు ఇక్క‌డ ఒక్కొక్క‌రి జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తుంటాయి. ఇక గ‌త కొంత‌కాలంగా కెరీర్ ప‌రంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రాజ్‌త‌రుణ్ ఎట్టి ప‌రిస్థితిలో హిట్ కొట్టి స‌త్తా చాటుకోవాల్సిన టైమ్‌లో ఓ కొత్త అవ‌తారం ఎత్త‌డం చ‌ర్చ‌కొచ్చింది. రాజ్ కొత్త‌గా క‌మెడియ‌న్ అవ‌తారం ఎత్తుతున్నాడంటూ ప్ర‌చారం సాగుతోంది. వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న రాజ్‌త‌రుణ్ కొత్త‌గా ట్రై చేయ‌డం వెన‌క వేరే కార‌ణాలు ఉన్నాయి. ఇదివ‌ర‌కూ డెబ్యూ ద‌ర్శ‌కుడు లంక‌ప‌ల్లి శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఠాగూర్ మ‌ధు నిర్మించే సినిమాకి రాజ్ సంత‌కం చేశాడు. వాస్త‌వానికి ఈ సినిమాలో వేరే హీరోను అనుకున్నారు. క‌మెడియ‌న్ ట‌ర్న్‌డ్ హీరో శ్రీ‌నివాస్‌రెడ్డి హీరో అనుకుంటే అత‌డు ప్రాజెక్టు నుంచి స్కిప్ కొట్టాడ‌ట‌. అటుపై ద‌ర్శ‌కుడు రాజ్ త‌రుణ్‌కి క‌థ వినిపించి ఓకే చేయించుకున్నాడు. దీంతో ఓ క‌మెడియ‌న్ కోసం రాసుకున్న స్క్రిప్టును రాజ్ త‌రుణ్ చేయాల్సి వ‌స్తోంది. అందుకే ఇప్పుడు స్క్రిప్టుకు, క‌థ‌కు త‌గ్గ‌ట్టు త‌న‌ని తాను మార్చుకుంటున్నాడ‌ట‌. చొక్కా లూజుగా ఉంద‌ని లావైతే త‌ప్పేం లేదు. కానీ ఫ్యాట్ పెర‌గ‌కుండా చూసుకోవ‌డం ఇంపార్టెంట్‌. రాజ్‌త‌రుణ్ ఆ ప‌ని స‌మ‌ర్థంగా చేస్తాడా?

User Comments