గురువు గారు.. గురువు గారూ అంటూ..!

అదుర్స్ లో ఈ డైలాగ్ మ‌రిచిపోవ‌డం అంత ఈజీ కాదు. ఎందుకంటే అప్పుడు బ్ర‌హ్మానందం చెప్పిన తీరు ఆ రేంజ్ లో ఉంది మ‌రి. ఇక ఇప్పుడు ఇదే డైలాగ్ ఓ ద‌ర్శ‌కురాలికి బాగా సూట్ అవుతుంది. ఆమె మ‌రెవ‌రో కాదు రాజుగాడు ఫేమ్ సంజ‌నా రెడ్డి. ఈమె గురువు ఇంకెవ‌రో కాదు రామ్ గోపాల్ వ‌ర్మ‌. అవును.. ఈయ‌న ద‌గ్గ‌ర రౌడీ సినిమాకు శిష్య‌రికం చేసింది ఈ ద‌ర్శ‌కురాలు. దానికి ముందు కొన్నాళ్లు మ్యాథ్స్ టీచ‌ర్ గా.. జ‌ర్న‌లిస్ట్ గా ప‌ని చేసిన సంజ‌నా సొంతంగా క‌థ రాసుకుని ఇప్పుడు రాజుగాడు సినిమాతో ద‌ర్శ‌కురాలు అయిపోయింది. త‌ను వ‌ర్మ ద‌గ్గ‌ర చాలా నేర్చుకున్నాన‌ని.. ఈ రోజు ఇలా మెగాఫోన్ ప‌ట్టుకున్నానంటే దానికి త‌న గురువు గారే కార‌ణ‌మంటుంది సంజ‌నా.

ఇన్ని గొప్ప‌లు చెప్పుకుంటూ ఇప్పుడు తీరా గురువు గారి సినిమాపైనే త‌న సినిమా విడుద‌ల చేస్తుంది సంజ‌నా రెడ్డి. ఈమె తెర‌కెక్కించిన రాజుగాడు సినిమా జూన్ 1న రిలీజ్ కానుంది. ఆ రోజే రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ఆఫీస‌ర్ కూడా రానుంది. నాగార్జున హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో మైరా స‌రీన్ హీరోయిన్. వ‌ర్మ సినిమాకు పోటీగా త‌న సినిమాను దింపుతుంది సంజ‌నా రెడ్డి. అదేంటంటే గురువు గురువే.. పోటీ పోటీనే అంటుంది. మొత్తానికి ఈ భామ తొలి సినిమా ఎలా ఉండబోతుందో..! అన్న‌ట్లు రాజుగాడులో రాజ్ త‌రుణ్ దొంగ‌గా న‌టిస్తున్నాడు. అత‌డికి దొంగ‌త‌నం చేసే జ‌బ్బు ఉంటుంది.

User Comments