రాజుగారిగ‌ది 2.. అక్క‌డ డిజాస్ట‌ర్..

ఈ ఏడాది ఓవ‌ర్సీస్ మార్కెట్ తెలుగు ఇండ‌స్ట్రీకి బాగా క‌లిసొచ్చింది. బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ‌గా మ‌న సినిమాలే అక్క‌డ వ‌సూలు చేసి ఔరా అనిపించాయి. కానీ డిజాస్ట‌ర్లు కూడా ఇలాగే ఉన్నాయి. మొన్న‌టికి మొన్న స్పైడ‌ర్ ఇంకా మ‌రిచిపోక ముందే.. రాజుగారిగ‌ది 2 రూపంలో మ‌రో డిజాస్ట‌ర్ వ‌చ్చింది. ఈ చిత్రం ఓపెనింగ్ వీకెండ్ లో కేవ‌లం 65 ల‌క్ష‌లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఇందులో ప్రీమియ‌ర్స్ నుంచే 47 ల‌క్ష‌లు రావ‌డం విశేషం.

ఆ త‌ర్వాత మూడు రోజుల్లో కేవ‌లం 20 ల‌క్ష‌లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. రాజుగారిగ‌ది 2 తొలి వారాంతంలో 2 ల‌క్ష‌ల 76 వేల డాల‌ర్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఇదే స‌మ‌యంలో ఊపిరి 9 ల‌క్ష‌ల డాల‌ర్లు.. మ‌నం 8 ల‌క్ష‌ల డాల‌ర్లు.. సోగ్గాడే చిన్నినాయ‌నా 5.35 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసాయి. వీటితో పోలిస్తే నాగార్జున ఇమేజ్ ఇప్పుడు ఎక్కువ‌. కానీ రాజుగారిగ‌ది 2 మాత్రం ఆ వ‌సూళ్ల‌కు క‌నీసం ద‌రిదాపుల‌కు కూడా వెళ్ల‌లేక‌పోయింది.

మ‌నం, ఊపిరి సినిమాలు 1 మిలియ‌న్ కూడా దాటేసాయి. కానీ ఇప్పుడు రాజుగారిగది 2 క‌నీసం 2 కోట్ల మార్క్ కూడా అందుకోలేక‌పోతుంది. ఈ చిత్ర హ‌క్కుల‌ను అక్క‌డ 1.90 కోట్ల‌కు తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు వ‌చ్చింది 70 ల‌క్ష‌లు మాత్ర‌మే. అంటే ఈ లెక్క‌న మ‌రో కోటి రూపాయ‌ల‌కు పైగా రావాలి. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇంత మొత్తం వెన‌క్కి రావ‌డం అనేది గ‌గ‌న‌మే.