కెన్యా కి రాజుగారి 96 రీమేక్ టీమ్!

త‌మిళ్ బ్లాక్ బ‌స్టర్ `96` తెలుగులో శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా రీమేక్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. మాతృక ద‌ర్శ‌కుడు సి. ప్రేమ్ కుమారే ఇక్క‌డ కూడా తెర‌కెక్కిస్తున్నారు. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పై దిల్ రాజు ఎంతో ఫ్యాష‌నేట్ గా చిత్రాన్ని ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. తాజాగా మారిష‌స్ లో శ‌ర్వానంద్ పై స్కూబా డైవింగ్ కు సంబంధించిన స‌న్నివేశాలను ఒక‌రోజంతా చిత్రీక‌రించారు. ఇక‌ రెండు, మూడు రోజుల్లో కెన్యాలో ఫ్రెష్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. దాదాపు 15 రోజుల పాటు షూటింగ్ అక్క‌డే ఏక‌ధాటిగా జ‌ర‌గ‌నుంది. అక్క‌డ కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ పూర్తిచేసిన అనంత‌రం అనంత‌రం యూనిట్ హైద‌రాబాద్ తిరుగు ప్ర‌యాణం కానుంది.

త‌దుప‌రి హైద‌రాబాద్, వైజాగ్ అందాల న‌డుమ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. దీంతో షూటింగ్ పూర్త‌వుతుంది. మొత్తం 30 నుంచి 33 రోజుల్లో యూనిట్ షూటింగ్ కు ప్యాక‌ప్ చెప్ప‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ రీమేక్ కు ఇంకా తెలుగు టైటిల్ ఖ‌రారు చేయ‌లేదు. అతి త్వ‌ర‌లోనే మేక‌ర్స్ టైటిల్ నిర్ణ‌యించి ప్ర‌క‌టించ‌నున్నార‌ని స‌మాచారం.