మ‌న హీరోల‌కు ర‌క్త‌క‌న్నీరే!

Last Updated on by

సౌత్ హీరోల‌కు అత‌డు ర‌క్త చ‌రిత్ర చూపిస్తున్నాడు. మీరు హీరోలు అయితే నేను విల‌న్! అని త‌న‌దైన లెవ‌ల్లో కోటింగ్ ఇస్తున్నాడు. ఇంత‌కీ ఎవ‌రీ గ‌డుగ్గాయ్‌.. అంటే? అత‌డే ర‌క్త‌చ‌రిత్ర హీరో వివేక్ ఒబేరాయ్‌. విల‌నీకి కొత్త అర్థం చెప్పిన క్రేజీ హీరో అత‌డు. మొర‌టుత‌నం.. మొండిత‌నం.. క‌రుకైన మాట తీరు ఉంటేనే ఫ్యాక్ష‌నిస్టు అని ప్రేక్ష‌కులు ఫీల‌వుతారు. దానిని అచ్చు గుద్దిన‌ట్టు చూపించాడు వివేక్‌. అందుకే అత‌డు సౌత్‌లో మ‌రోసారి విల‌న్‌గా బ‌రిలో దిగుతున్నాడు అన‌గానే ఊరూ వాడా అంతా ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు.

ప్ర‌స్తుతం అత‌డు రామ్‌చ‌ర‌ణ్‌కి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. చ‌ర‌ణ్ – బోయ‌పాటితో ఆర్‌.సి 12 ఆన్ సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఒబేరాయ్‌తో సీన్స్‌ని కీల‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లో ఉండ‌గానే, ఒబేరాయ్ న‌టించే త‌దుప‌రి సౌత్ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ అందింది. అత‌డు మ‌రో సౌత్ స్టార్, క‌న్న‌డిగ అయిన‌ శివ‌రాజ్‌కుమార్‌కి విల‌న్‌గా న‌టించ‌నున్నాడు. రుస్తోమ్ అనేది శివ‌న్న సినిమా. ఈ చిత్రంతో వివేక్ క‌న్న‌డిగుల‌కు ర‌క్త చ‌రిత్ర చూపించ‌బోతున్నాడుట‌. చ‌ర‌ణ్‌తో త‌న పార్ట్‌ షూటింగ్ అయిపోగానే, ఆగ‌స్టులో శివ‌న్న కోసం అటెళుతున్నాడ‌ట‌. అయితే ఆ ఇద్ద‌రికేనా? .. ఇంకెంద‌రికి ర‌క్త‌చ‌రిత్ర చూపిస్తాడో? అంటూ ఒక‌టే ముచ్చ‌టా సాగుతోంది. క్రిష్ 3తో వివేక్ గ్రాఫ్ సౌత్‌లో స్కై లెవ‌ల్‌కి చేరుకుంది. క్రూరుడైన విల‌న్‌గా అత‌డికి సౌత్‌లో ఇమేజ్ ఉంది. పిల్ల‌లు సైతం అత‌డిని గుర్తు ప‌ట్ట‌డం విశేషం. మొత్తానికి ఒబేరాయ్ మునుముందు ఆడియెన్‌కి ర‌క్త‌క‌న్నీరు చూపిస్తాడ‌ని ఫిక్స‌వ్వాల్సిందే.

User Comments