హ‌ద్దులు దాటుతున్న ర‌కుల్ హాట్ షో!

తెలుగులో గ‌త రెండే మూడేళ్ల‌లో ర‌కుల్ లేని సినిమా లేదంటే అది అతిశ‌యోక్తి కాదేమో. అంత‌గా వ‌రుస అవ‌కాశాల్ని ద‌క్కించుకుంది ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. కానీ అది నిన్న‌టి మాట..టైమ్ మారింది. ర‌కుల్ హ‌వా త‌గ్గింది. ఒక ద‌శ‌లో ఏడాదికి మూడు నాలుగు చిత్రాల్లో న‌టించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ర‌కుల్ చేతిలో ఇప్పుడు చెప్పుకోవ‌డానికి ఏడాదికి ఒక సినిమా కూడా లేని ప‌రిస్థితి. త‌మిళంలో కార్తీతో క‌లిసి చేసిర `దేవ్‌` అడ్ర‌స్ లేకుండా పోయి ర‌కుల్ ఆశ‌లను ఆవిరి చేసింది.
ఈ సినిమా త‌రువాత తెలుగులో ర‌కుల్‌ని తీసుకోవాల‌నే ద‌ర్శ‌క‌నిర్మాత‌లే క‌రువ‌య్యారంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. తెలుగులో కెరీర్ అవ‌సాన ద‌శ‌కు చేరుకుంద‌ని గ‌మ‌నించిన ర‌కుల్ సీనియ‌ర్‌ల‌తో కూడా సై అంటోంది. `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు`లో బాల‌య్య‌తో ఆడిపాడిన ర‌కుల్ మ‌రో సీనియ‌ర్ హీరో కింగ్ నాగార్జున‌తో రొమాన్స్‌కు జైకొట్టింది. `మన్మ‌ధుడు-2` పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.
ఇదిలా వుంటే బాలీవుడ్‌లో త‌న హ‌వా కొన‌సాగించాని ర‌కుల్ హ‌ద్దులు దాటి అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అజ‌య్ దేవగ‌ణ్‌, టాబు క‌లిసి న‌టిస్తున్న `దే దే ప్యార్ దే` సినిమాలో ర‌కుల్ న‌టిస్తోంది. ఇందులోని `బ‌ద్దీ శ‌రాబ‌న్‌..` పాట‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌ను క‌వ్విస్తూ రకుల్ అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అవ‌కాశాల కోసం ర‌కుల్ హ‌ద్ద‌లు దాటుతోందంటూ నెటిజ‌న్స్ ర‌కుల్‌పై సెటైర్లు వేయ‌డం మొద‌లుపెట్టారు. వాటిని ఏమాత్రం ఖాత‌రు చేయ‌ని ర‌కుల్ ఈ పాట‌కు సంబంధించిన స్టిల్స్‌ని య‌ధేచ్ఛ‌గా త‌న ఇన్‌స్టాగ్ర‌మ్ ఖాతాలో పోస్ట్ చేస్తోంది.