ర‌కుల్ హెలీకాఫ్ట‌ర్ రైడ్ స్కీమ్‌

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవ‌డ‌మెలానో నేర్పిస్తోంది ర‌కుల్‌. కొత్త కొత్త ప్ర‌ణాళిక‌ల‌తో కొంగొత్త‌గా దూసుకుపోతోంది అందాల‌ ర‌కుల్ ప్రీత్‌. ఈ దిల్లీ భామ ప్లాన్స్ అల్టిమేట్‌. ఇంత‌కుముందు అత్యంత లాభ‌దాయ‌క‌మైన ఫిట్‌నెస్ జిమ్‌ల బిజినెస్‌లో ప్ర‌వేశించింది. ఇప్పుడు సొంతంగా మొబైల్ యాప్ ప్రారంభించి ర‌క‌ర‌కాల వ్యాపార‌, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని గుప్పించ‌నుంది. ఓవైపు త‌న సినిమాల ప్ర‌మోష‌న్‌, మరోవైపు వ్య‌క్తిగ‌త వ్యాపారాల స‌మృద్ధి.. వీట‌న్నిటికీ ప్ర‌చారం అంతే సులువుగా యాప్‌లో చేసేస్తోంది.. ఈ ప్ర‌మోష‌న్‌ వ్వాహ్‌! అంటూ పొగిడేస్తున్నారంతా.

త‌న‌వైన వ్యాపారాల్ని వృద్ధి చేసుకునేందుకు ర‌కుల్ స్కీమ్‌లు కూడా అదే రేంజులో ఉన్నాయి. వాటిలో ఒక‌టి మొబైల్ యాప్‌. యాప్‌లో సినిమా చూపిస్త‌! అన్న చందంగా.. ఈ భామ‌.. యాప్‌ని లాంచ్ చేయ‌డ‌మే గాకుండా, ఏకంగా హెలీకాఫ్ట‌ర్‌లో రైడ్ స్కీమ్‌ని అమ‌ల్లోకి తెచ్చింది. ల‌క్కీ విన్న‌ర్స్‌లోంచి ముగ్గురిని ఎంపిక చేసి ముంబైని హెలీకాఫ్ట‌ర్ నుంచి ఏరియ‌ల్ వ్యూలో చూపిస్తాన‌ని ప్రామిస్ చేసింది. ఈ ప్రామిస్‌ని నిల‌బెట్టుకుంటూ ముగ్గురు ల‌క్కీ విన్న‌ర్స్‌ని ఎంపిక చేసిన ర‌కుల్ నేటి సాయంత్రం ముంబైలో హెలీకాఫ్ట‌ర్ రైడ్‌కి వెళుతోంది. ప్ర‌స్తుతం ఈ దిల్లీ భామ ముంబై ప‌రిశ్ర‌మ‌ను ఏలే ప్లాన్‌లో ఉంది. అక్క‌డే ఓ హిందీ సినిమాలోనూ న‌టిస్తూ బిజీగా ఉంది.