కాజల్ సైడ్ బిజినెస్

Last Updated on by

ఒక‌టో తారీఖు వ‌చ్చిందంటే చాలు ఉద్యోగులంతా శాల‌రీ కోసం వేచి చూస్తున్న‌ట్లు.. హీరోయిన్లంతా మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల కోసం వేచి చూస్తుంటారు. ఎవ‌రెవ‌రు ఏయే మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ ఎక్కుదామా అని చూస్తుంటారు. ఇప్ప‌టికే మ్యాగ్జిమ్ క‌వ‌ర్ పేజీపై బికినీతో ర‌కుల్ క‌వ్వించింది. ఇప్పుడు కాజ‌ల్ కూడా క‌వ‌ర్ ఎక్కేసింది.

Rakul Kajal Hot Photo shoots for Magazines Cover Pages

కాజ‌ల్ రెగ్యుల‌ర్ గా ఉండే సినిమా మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీలు ఎక్క‌లేదు. వెరైటీగా ఉంటుంద‌ని ఎగ్జిబిట్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై ద‌ర్శ‌న‌మిచ్చింది. టెక్నాల‌జీతో పాటు ఆటోమొబైల్.. లైఫ్ స్టైల్ కు సంబంధించిన మ్యాగ‌జైన్ ఇది. ఫిబ్ర‌వ‌రి క‌వ‌ర్ పేజీపై ఆడి క్యూ 5 కార్ ముందు నిల‌బ‌డి ఎర్ర‌గౌనులో అదిరిపోయే పోజిచ్చింది చంద‌మామ‌. పైగా ఆ గౌన్ కాళ్ళ ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి మ‌రికొంచెం పైకి జ‌రిగి మ‌న‌సు మ‌రింత జిల్ అనిపిస్తుంది. అప్పట్లో అయితే ఎఫ్ హెచ్ ఎం మ్యాగ‌జైన్ కోసం తన ఎద అందాలు కనిపించకుండా చేతులతో కవర్ చేసి ఫోటో షూట్ కూడా చేసింది.

Rakul Kajal Hot Photo shoots for Magazines Cover Pages

దానికితోడు కాజ‌ల్ ఓర‌చూపులు ఎలాగూ ఉన్నాయి. ఆ చూపుల్లోనే కుర్రాళ్లు చ‌చ్చిపోతారేమో..? కార్ ముందు పోజ్ ఇచ్చి ఆడీ ల‌వ‌ర్స్ ను.. అదిరిపోయే క్యాస్ట్యూమ్ తో లైఫ్ స్టైల్ వాళ్ల‌ను.. ఓర‌చూపుతో సినిమా వాళ్ల‌ని అంద‌రినీ ఒకే పోజుతో ప‌డ‌గొట్టింది కాజల్. ఓ వైపు ఇలా ఫోటోషూట్లు చేస్తూనే.. మ‌రోవైపు సినిమాల్లోనూ బిజీగా ఉంది కాజ‌ల్. ప్ర‌స్తుతం తెలుగులో క‌ళ్యాణ్ రామ్ కు జోడీగా ఎమ్మెల్యే.. కొత్త ద‌ర్శ‌కుడు నానితో బెల్లంకొండ శ్రీ‌నివాస్ చేయ‌బోయే సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది కాజ‌ల్. దానికితోడు ఇలా వీలు దొరికిన‌పుడు మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ ఎక్కుతూ మ‌తులు చెడ‌గొడుతుంటుంది చంద‌మామ‌.

User Comments