సొంత గూటికి చేరుకున్న ర‌కుల్

పేరుకు ఉత్త‌రాది ముద్దుగుమ్మే అయినా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైపోయింది ర‌కుల్ ప్రీత్ సింగ్. ద‌క్షిణాదిన ఈ భామ‌కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. ఇక్క‌డ స్టార్ హీరోయిన్లంద‌రికీ షాకిచ్చి కుర్రాళ్ళంద‌రితోనూ జోడీ క‌ట్టింది ఈ ముద్దుగుమ్మ‌. పైగా గ్లామ‌ర్ షో లో పెద్ద‌గా హ‌ద్దులేవీ లేక‌పోవ‌డంతో ఈజీగానే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్ర‌స్తుతం కార్తితో ఖాకీ.. సూర్య‌తో ఓ సినిమాకు క‌మిటైంది ర‌కుల్. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే ఇప్పుడు హిందీలో ఐయ్యారి సినిమాకు సైన్ చేసింది ర‌కుల్.

నీర‌జ్ పాండే తెర‌కెక్కిస్తోన్న‌ ఐయ్యారి షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ మ‌ధ్యే కైరోలో చివ‌రి షెడ్యూల్ పూర్తి చేసాడు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తున్నాడు. వ‌ర‌స విజ‌యాల‌తో జోరుమీదున్న నీర‌జ్ పాండే ద‌ర్శ‌కుడు కావ‌డంతో.. బాలీవుడ్ లో ఈ చిత్రం త‌న కెరీర్ కు మ‌రింత ఊపు తీసుకొస్తుంద‌ని న‌మ్ముతుంది ర‌కుల్. 9 ఫిబ్రవరి 2018 న ఈ సినిమా విడుదల కానుందని ఈ చిత్ర నిర్మాత అనౌన్స్ చేసాడు. యారియాన్ త‌ర్వాత బాలీవుడ్ కు దూర‌మైంది ర‌కుల్. షిమ్లామిర్చిలో న‌టించినా అదింకా విడుద‌ల కాలేదు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు సొంత ఇండ‌స్ట్రీలో ఓ సినిమాకు సైన్ చేసింది ర‌కుల్.